BigTV English

Sarangapani Jathakam : ‘సారంగపాణి’ జాతకం కాదు… ముందు ఇంద్రగంటి, దర్శిల జాతకం మారాలి

Sarangapani Jathakam : ‘సారంగపాణి’ జాతకం కాదు… ముందు ఇంద్రగంటి, దర్శిల జాతకం మారాలి

Sarangapani Jathakam : టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి లీడ్ రోడ్ లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సారంగపాణి జాతకం’. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, నిర్మాత శివలింగ కృష్ణ ప్రసాద్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. గతంలో జెంటిల్మెన్, సమ్మోహనం వంటి సినిమాలకు డైరెక్టర్ ఇంద్రగంటి- నిర్మాత శివలింగ కృష్ణ ప్రసాద్ కలిసి పని చేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా ఇది. తాజాగా మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు చిత్ర బృందం.


‘గేమ్ ఛేంజర్’ను రీప్లేస్ చేసిన ‘సారంగపాణి’
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోందని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతికి వాయిదా పడింది. దీంతో తాజాగా ఆ రిలీజ్ డేట్ ను ‘సారంగపాణి జాతకం’ మూవీకి ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, ప్రస్తుతం డబ్బింగ్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని, సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసి క్రిస్మస్ సెలవుల సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత తెలిపారు. కాగా ‘సారంగపాణి జాతకం’ మూవీ ఒక కంప్లీట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వైవా హర్ష, నరేష్ వికె, తనకెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల వంటి ప్రముఖ కమెడియన్లు నటిస్తున్నారు. రూప కొడుయూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

ముందు ఇంద్రగంటి, ప్రియదర్శి జాతకం మారాలి
అయితే ‘సారంగపాణి జాతకం’ మూవీ హిట్ కావడం హీరోతో పాటు డైరెక్టర్ కు కూడా ముఖ్యమే. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి 2018లో ‘సమ్మోహనం’ సినిమాతో హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఇప్పటిదాకా ఆయనకు ఒక్క హిట్ కూడా పడలేదు. వి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలు తీశాడు. కానీ అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. అప్పటి నుంచి ఆయన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రియదర్శి రీసెంట్ గా ‘డార్లింగ్’ అనే సినిమాతో సోలోగా థియేటర్లోకి వచ్చాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 2023 లో వచ్చిన ‘బలగం’ తర్వాత ప్రియదర్శి ఖాతాలో కూడా సరైన హిట్ పడలేదు. దీంతో ఇటు హీరో అటు డైరెక్టర్ ‘సారంగపాణి జాతకం’పై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీతో వీళ్లిద్దరి జాతకం మారుతుందా? అనేది తెలియాలంటే డిసెంబర్లో మూవీ తెరపైకి వచ్చేదాకా వెయిట్ అండ్ సి.


కలిసి వచ్చిన క్రిస్మస్
కాగా ‘సారంగపాణి జాతకం’ మూవీ రిలీజ్ కి క్రిస్మస్ హాలిడేస్ కలిసి రాబోతున్నాయి. ఒకవేళ మూవీ కనుక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ‘సారంగపాణి జాతకం’తో పాటు హీరో డైరెక్టర్ జాతకాలు కూడా మారిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×