Sai Durga Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)చివరిగా తన మామయ్య, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకో లేకపోయినా పరవాలేదు అనిపించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎంతో బిజీగా మారిపోయారు. ఇక సాయి ధరమ్ తేజ్ సంబరాల యేటిగట్టు (Sambarala Yetigattu) అనే సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే.రోహిత్ కేపీ (Rohit KP)దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాలో సాయి దుర్గ తేజ్ సరసన కోలీవుడ్ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు శ్రీకాంత్(Srikanth) కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఇది కదా డెడికేషన్ అంటే..
ఇలా ఈ సినిమా ఇప్పటికే 120 రోజుల పాటు షూటింగ్ పనులను జరుపుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 75% షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని, తాజాగా చిత్ర బృందం తెలిపారు. 120 రోజులలో 75% షూటింగ్ పూర్తి కావడం అంటే ఈ సినిమా విషయంలో చిత్ర బృందం ఎంతటి శ్రద్ధ వహిస్తున్నారో స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైనటువంటి కార్నేజ్ టీజర్ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా, సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు. ఇప్పటికే 75% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం భారీ స్థాయిలో సెట్ వేయబోతున్నారని, ఈ షెడ్యూల్ చిత్రీకరణలో కీలక యాక్షన్ సన్ని వేషాలను కూడా చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది.
స్ట్రాంగ్ కం బ్యాక్…
ఇక ఈ సినిమా సాయి తేజ్ కెరియర్లో అద్భుతమైన చిత్రంగా నిలిచిపోతుందని తెలుస్తోంది. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ విడుదల చేయడానికి మేకర్స్ కూడా సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ తో పాటు పలువురు కీలక నటీనటులు కూడా భాగస్వామ్యం అయ్యారు వారి వివరాలన్నింటినీ కూడా త్వరలోనే అధికారకంగా తెలియజేయనున్నారు. ఇక సాయి తేజ్ రిపబ్లిక్ సినిమా తర్వాత రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఆయన దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీకి కొంత గ్యాప్ తర్వాత విరూపాక్ష సినిమా ద్వారా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన సాయి తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇక విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమాలో నటించారు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను కాస్త నిరాశపరిచింది.మరి ఈ సినిమాతో సాయి తేజ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.