Bathini Goud: జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో చేయాల్సిన ఏర్పాట్ల పై సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. మొత్తం చేప ప్రసాదం పంపిణీ కోసం ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ నుంచి 1.5 లక్షల చేపలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు గత సంవత్సరం కంటే అదనంగా మరిన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అగ్నిమాపక బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బి జీహెచ్ఎంసీ,విద్యుత్ తదితర డిపార్ట్ మెంట్లు సమన్వయం చేసుకొని పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జీహెచ్ ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ వివిధ విభాగాల అధికారులు సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు.
అలాగే చేపల ప్రసాదం పంపిణీప బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులకు కూడా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే నెల 8వ తేదీ ఉదయం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. దివంగత బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిని అమర్నాథ్ గౌడ్ మాట్లాడారు. మృగశిర కార్తీ జూన్ 8వ తారీఖున ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రవేశిస్తుందని, ఆ రోజునే చేప ప్రసాదం పంపిణీ చేస్తామని వారు చెప్పారు.
దేశ, విదేశాల నుంచి ఇక్కడకు లక్షలాది మంది వస్తుంటారని.. గ్రౌండ్ లో ఎవ్వరికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పంపిణీ సజావుగా సాగడానికి ఈ సంవత్సరం ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని వివరించారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మున్సిపాలిటీ, పోలీస్, విద్యుత్తు శాఖతో పాటు మత్య్సశాఖలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతామని చెప్పారు.
ALSO READ: Diamond Mining: తెలుగు రాష్ట్రాల్లో భారీగా వజ్రాలు.. దొరికితే కోటీశ్వరులే.. ఎక్కడో తెల్సా?
గత రెండు దశాబ్దాల నుంచి తమ కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిర కార్తీ ప్రవేశించిన మంచి శుభ ఘడియాన ఓ పదార్ధాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని చెప్పారు. అది వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాలుగు నుంచి ఐదేళ్లు తీసుకుంటే పూర్తిగా నయం అవుతోందని వారు చెప్పారు.
ALSO READ: Tirumala Alipiri: అలిపిరి మెట్ల మార్గంలో… గడ్డిపోచ కదిలినా ఇక రికార్డే!
ఎన్నో ఏళ్ల నుంచి లక్షలాది మంది శ్వాస సంబంధిత రోగులకు చేప మందు ఇస్తున్నామని వారు చెప్పారు. అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లైన్ లో రోగులు ఇబ్బందులు తలెత్తకుండా.. రెండు వందల మంది వాలంటీర్లు సేవలందిస్తారని తెలిపారు. చేపల ప్రసాదం పంపిణీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.