BigTV English

Sai Pallavi on Thandel movie: ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎటువంటి ఒత్తిడి చేయలేదు

Sai Pallavi on Thandel movie: ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎటువంటి ఒత్తిడి చేయలేదు

Sai Pallavi on Thandel movie: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు. మలయాళం లో రిలీజ్ అయిన ప్రేమమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సినిమాను తెలుగులో ప్రేమమ్ పేరుతో కూడా రీమేక్ చేసి రిలీజ్ చేశారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించారు. సాయి పల్లవికి ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ (Sukumar) లాంటి స్టార్ డైరెక్టర్ కూడా సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ అని పిలిచారు. అయితే సాయి పల్లవి తెలుగులో చేసిన సినిమాలన్నిటిలో కూడా ఇప్పటివరకు బెస్ట్ ఫిలిం అంటే శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో వహించిన ఫిదా అని చెప్పాలి. వరుణ్ సందేశ్ కెరియర్ లో కూడా ఈ సినిమా మంచి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.


Also Read: Chiranjeevi : మెగాస్టార్ ఇంట మెగా ఫంక్షన్… గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అయిన శ్రీజ

అయితే సాయి పల్లవి తెలుగులో చాలా సినిమాలు చేసినా కూడా అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎంసీఏ, పడి పడి లేచే మనసు వంటి సినిమాలు ఎన్నో అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. ఇక మళ్ళీ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది సాయి పల్లవి. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ముఖ్యంగా నాగచైతన్య మరియు సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. అందుకోసమే చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న తండేల్ సినిమాకి సాయి పల్లవి ను హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.

మొదటి ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ అవుతుంది అని అందరూ భావించారు. కానీ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు తర్వాత వార్తలు కూడా వచ్చాయి. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించడానికి ఒక ఈవెంట్ కండక్ట్ చేసింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ లో సాయి పల్లవి మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి చిత్ర యూనిట్ ఎప్పుడు ఒత్తిడి చేయలేదు. ఈ సినిమాను చేస్తున్నప్పుడు ఎటువంటి ఆలోచన రాలేదు అంటూ తెలిపింది. సాయి పల్లవి చెప్పిన ఈ మాటలతో సినిమా ఎంత బాగా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది. కార్తికేయ 2 సినిమాతో దర్శకుడు చందు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ సినిమా ఒక యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకొని తీస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×