Sai Pallavi:ప్రముఖ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) కి అటు అభిమానులలోనే కాదు ఇటు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఆ క్రేజ్ ఎంతలా అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా పాకిపోయింది కూడా.. ఏ సినిమా చేసినా సరే ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఉమ్మడి అదృష్టం మామూలుగా లేదని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే తెలుగులో ‘ఫిదా’ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈమె ఇప్పుడు విజయ్ దళపతి(Vijay Thalapathy) , మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni) లాంటి సెలబ్రిటీలను కూడా సోషల్ మీడియాలో వెనక్కి నెట్టింది అంటే ఇక ఈమె డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సోషల్ మీడియాలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న సాయి పల్లవి..
అసలు విషయంలోకెళితే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సెలబ్రిటీగా సాయి పల్లవి నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక దేశవ్యాప్తంగా 25% మంది ఇన్స్టాగ్రామ్ లో సాయి పల్లవి కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది . దీన్ని బట్టి చూస్తే ఇండియా మొత్తం జనాభాలో 25 శాతం మందిని ఇంస్టాగ్రామ్ లో సాయి పల్లవి ప్రభావితం చేస్తోందని సమాచారం. అలా ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఇలాంటి ఘనత అందుకోలేదని, ఈ రికార్డు కేవలం సాయి పల్లవికి మాత్రమే సొంతమైందని అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే ఇదే ఇంస్టాగ్రామ్ ద్వారా 20 శాతం మంది జనాలను విజయ్ ఆకట్టుకోగా.. 17 శాతం మంది జనాలను ఎమ్మెస్ ధోని దేశవ్యాప్తంగా ప్రభావితం చేస్తున్నట్లు పోస్టులు కూడా పెడుతున్నారు. ఇక మిగిలిన సెలబ్రిటీలలో చాలామంది ఐదు శాతం వరకు జనాలను ప్రభావితం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ లెక్కలు చూసుకుంటే సాయి పల్లవి మొదటి స్థానానికి చేరుకోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఈమె ఎంతలా ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవచ్చని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే దేశవ్యాప్తంగా సాయి పల్లవికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Tamannaah: నా జీవితంలో మరిచిపోలేని సంఘటన అదే.. కన్నీళ్లు పెట్టుకున్న తమన్నా..!
సాయి పల్లవి కెరియర్..
ఇక సాయి పల్లవి విషయానికి వస్తే.. చివరిగా తమిళంలో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా ‘అమరన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో చివరిగా చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో నాగచైతన్య(Naga Chaitanya)హీరోగా వచ్చిన తండేల్ (Thandel) సినిమాలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పుడు హిందీలో బాలీవుడ్ రామాయణంలో నటిస్తోంది. ఇందులో సీత పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.ఇకపోతే ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వదలకపోవడం గమనార్హం కానీ సాయి పల్లవి కి సంబంధించిన ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.