Tamannaah:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా మిల్క్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించి, భారీ పాపులారిటీ అందుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన(Upasana) కి కూడా ఫ్రెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే..ముఖ్యంగా ఆ స్నేహంతోనే ఉపాసన ప్రపంచంలోనే అత్యంత విలువైన రెండవ వజ్రాన్ని తమన్నాకు బహుమతిగా అందించింది. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య స్నేహం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే తమన్నా ఒకవైపు తెలుగు మరొకవైపు తమిళ్ అంటూ వరుస సినిమాలలో నటించి ఇప్పుడు హిందీలో అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ అనుకున్నంత స్థాయిలో ఈమెకు అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తెలుగులో సంపత్ నంది(Sampath Nandi) పర్యవేక్షణలో వస్తున్న చిత్రం ‘ఓదెలా 2’.
Jacqueline Fernandez: ఇండస్ట్రీలో విషాదం.. జాక్వెలిన్ తల్లి మృతి..!
అలా చూశాను కాబట్టే ఈ స్థాయిలో ఉన్నాను – తమన్నా.
‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ ఓదెల 2 మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న తమన్నా.. తన జీవితంలో మరిచిపోలేని ఒక సంఘటన జరిగింది అని.. దానికోసం ఎంతో కష్టపడ్డాను అని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన మాటలతో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా తమన్న మాట్లాడుతూ.. నటనను నేనెప్పుడూ కూడా ఒక జాబ్ లాగా చూడలేదు. నేను చేస్తున్న ప్రతి పనిని కూడా ఎంజాయ్ చేస్తూ వచ్చాను. అందుకే ఎప్పుడూ ఏ సినిమా విషయంలో కూడా నాకు నటన కష్టంగా అనిపించలేదు. పదవ తరగతిలోనే నేను సినిమాల్లోకి వచ్చాను. స్టడీస్ లో టీచర్లు నాకు ఎంతో హెల్ప్ చేసేవారు. ఒకసారి నా అసైన్మెంట్స్ కూడా టీచర్లే రాసేవారు. నిజానికి రియల్ లైఫ్ లో నేను కాలేజీకి వెళ్లలేదు. కానీ రీల్ లైఫ్ లో మాత్రం కాలేజ్ స్టూడెంట్ గా ఎన్నో సినిమాలు చేశాను.
ఆ సంఘటన చదివాక నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి – తమన్నా..
నేను ఇండస్ట్రీకి వచ్చి.. అప్పుడే 20 ఏళ్ళు అవుతోంది అంటే.. నమ్మ బుద్ధి కావడం లేదు. కెరియర్ మొదలు పెట్టిన కొత్తలో ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటానని కూడా నేను అనుకోలేదు. ముఖ్యంగా నాకు 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. నా బర్త్ డే సందర్భంగా ఒకరోజు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొని ఇంట్లో ఉన్నాను. అప్పుడు న్యూస్ పేపర్ లో నాపై ఒక వార్త వచ్చింది. అందులో నన్ను తమిళంలో నెంబర్.1 నటి అని రాశారు. అయితే ఆ వార్త చదవగానే ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి
అంత త్వరగా ఆ స్థానానికి నేను వెళ్తాను అనుకోలేదు. అందుకే ఆ సంఘటన నన్ను ఏడిపించేసింది. అయితే నెంబర్ వన్ ప్లేస్ లో ఉండడం అనేది అంత సులభమేమీ కాదు. అందుకే ఆ పొజిషన్ కోసం ఎంతో కష్టపడ్డాను. బాధ్యతగా మంచి సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరించాను. ఇప్పటికీ కూడా అదే చేయబోతున్నాను అంటూ తమన్న తెలిపింది. ఇక ప్రస్తుతం తమన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.