BigTV English

Sai Pallavi: ముఖానికి సర్జరీ.. సాయి పల్లవి ఏమన్నదంటే.. ?

Sai Pallavi: ముఖానికి సర్జరీ.. సాయి పల్లవి ఏమన్నదంటే.. ?

Sai Pallavi: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం ఉంటేనే రోజులు. ముఖ్యంగా హీరోయిన్స్ కు అయితే వయస్సు పెరిగినా అందం తరగకూడదు. అలా ఉంటేనే అవకాశాలు వస్తాయి. అందాల ఆరబోత చేయాలి. ముఖం అంతా నున్నగా ఉండాలి. ముక్కు, మూతి వంకర్లు ఉండకూడదు.. ఏదైనా ఉంటె సర్జరీ చేయించుకోని సరిచేసుకోవాలి. రోజు జిమ్ చేసి బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇలాంటి ఆంక్షలు ఉన్న ఇండస్ట్రీకి సాయిపల్లవి వచ్చింది. ఇలాంటివేమీ పట్టించుకోకుండా తనకు ఎలా నచ్చితే అలా ఉంది. మొదటి సినిమా ప్రేమమ్ లో ఆమెను చూసి అందరూ నవ్వుకున్నారు.. ట్రోల్ చేశారు.


ముఖం నిండా మొటిమలు ఉన్నాయి.. ఈమె హీరోయినా.. ? అన్నారు. మచ్చల హీరోయిన్ అని విమర్శించారు. ఇలాంటివేమీ ఆమె పట్టించుకోకుండా కేవలం నటనతోనే స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరింది. ఇప్పటివరకు ఎలాంటి ఫేస్ క్రీమ్స్ కూడా ఆమె వాడనుకూడా లేదట. అయితే ఈ మధ్యకాలంలో ఆమె ముఖం కొంచెం నున్నగా మారింది. దీంతో ఒక ఇంటర్వ్యూలో సాయిపల్లవికి ఒక ప్రశ్న ఎదురైంది. మొటిమలు తగ్గడానికి మీరేమైనా సర్జరీ చేయించుకున్నారా.. ? అని అడగ్గా.. సాయిపల్లవి మాట్లాడుతూ..” నేను సర్జరీ లాంటిది ఏది చేయించుకోలేదు.

యుక్త వయస్సులో అమ్మాయిలకు మొటిమలు రావడం సహజమే. పెరిగేకొద్దీ అవే తగ్గిపోతాయి. వీటికోసం ప్రత్యేకంగా చికిత్సలు, థెరపీలు చేయించుకోనవసరం లేదు. నేను ఎక్కువగా ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాను.. కేవలం అలోవెరా జెల్స్ మాత్రమే వాడతాను. ఇక నా జుట్టు రహస్యం కూడా అదే” అని చెప్పుకొచ్చింది.


ఇకపోతే ప్రస్తుతం సాయిపల్లవి వరుస సినిమాలతో బిజీగా మారింది తెలుగులో నాగ చైతన్య సరసన తండేల్ చేస్తుండగా.. తమిళ్ లో శివ కార్తికేయన్ సరసన అమరన్ లో నటిస్తుంది. ఈ రెండు కాకుండా బాలీవుడ్ రామాయణ లో సీతగా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరి ఈ సినిమాలతో సాయిపల్లవి ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి. ముఖ్యంగా రామాయణ లో సీతగా ఆమె ఎలా మెప్పిస్తుంది అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కనుక మంచి హిట్ అయ్యింది అంటే సాయిపల్లవికి తిరుగే ఉండదు అని చెప్పుకుంటున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×