BigTV English

Sai Pallavi: హీరోలను మించిన పాపులారిటీ… అరుదైన ఘనత సొంతం చేసుకున్న సాయి పల్లవి..!

Sai Pallavi: హీరోలను మించిన పాపులారిటీ… అరుదైన ఘనత సొంతం చేసుకున్న సాయి పల్లవి..!

Sai Pallavi:తెలుగు సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవి(Sai Pallavi)కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ హీరోయిన్ నటనా పరంగా ఎంతోమంది హీరోయిన్లను బీట్ చేస్తూ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ యాక్టింగ్ లో వాళ్ళనే బీట్ చేస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ.. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా సృష్టించని ఒక అరుదైన రికార్డు అందుకుంది. మరి ఇంతకీ సాయి పల్లవి ఖాతాలో పడ్డ ఆ అరుదైన రికార్డు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. నేచురల్ యాక్టింగ్ కి కేరాఫ్ అడ్రస్ గా టాలీవుడ్ హీరోలలో నానిని,హీరోయిన్లలో సాయి పల్లవిని అంటారు. ఈ హీరోయిన్ కేవలం నేచురల్ యాక్ట్రెస్ గానే కాకుండా లేడీ పవర్ స్టార్ అనే ముద్ర కూడా వేసుకుంది. ఇక సాయి పల్లవి ఏ సినిమాలో నటించినా.. ఆ సినిమా ఫ్లాపైనా.. హిట్ అయినా సాయి పల్లవి (Sai Pallavi) యాక్టింగ్ కి మాత్రం మంచి మార్కులే పడతాయి. సినిమా పెద్ద డిజాస్టర్ అయినా సరే సాయి పల్లవి క్రేజ్ మాత్రం తగ్గిపోదు. అయితే అలాంటి సాయి పల్లవి గత ఏడాది ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కిన అమరన్ మూవీ(Amaran Movie)లో ఇందూ రెబేకా వర్గీస్ పాత్రలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది.


తండేల్ మూవీతో అరుదైన గౌరవం..

అమరన్ సినిమా అందించిన క్రేజ్ తో.. ఈ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి తాజాగా తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ అందుకుంది. కానీ ఈ సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ కి మరోసారి మంచి మార్కులు పడ్డాయి. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా సృష్టించని ఒక అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. మరి ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే..భారీ కటౌట్. టాలీవుడ్ ఇండస్ట్రీ అనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా సరే స్టార్ హీరోల అభిమానులు, తమ అభిమానం హీరోల, హీరోయిన్ల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే థియేటర్ల దగ్గర పెద్ద పెద్ద కటౌట్లు పెడుతూ.. ఆ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ,పూలదండలు వేస్తూ, కొబ్బరికాయలు కొడుతూ నానా హంగామా చేస్తారు. అలా హీరోల అభిమానులు పోటీ పెట్టుకొని మరీ ఒక హీరో కంటే మరొక హీరో కటౌట్ ని భారీ సైజులో పెడుతూ ఉంటారు. అయితే ఇప్పటివరకు థియేటర్ల దగ్గర హీరోల కటౌట్ పెట్టడం మాత్రమే చూసాం. కానీ మొదటిసారి సాయి పల్లవి(Sai Pallavi) కటౌట్ పెట్టారు.


వైజాగ్ లో సాయి పల్లవి భారీ కటౌట్..

అయితే ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి సంబంధించి కటౌట్ కూడా ఇలా పెట్టలేదు.కానీ సాయి పల్లవికి సంబంధించి భారీ కటౌట్ పెట్టడంతో సాయి పల్లవి ఖాతాకి ఓ అరుదైన గౌరవం దక్కింది. ఇక సాయి పల్లవి గత ఏడాది వైజాగ్ కి సినిమా షూటింగ్ కోసం వెళ్ళింది. అక్కడికి వెళ్లిన సమయంలో అభిమానులందరూ ఆమెను చాలా ప్రేమగా రిసీవ్ చేసుకున్నారట. అయితే ఎప్పుడైతే సాయి పల్లవి వైజాగ్(Vizag) అభిమానుల ప్రేమను దక్కించుకుందో అప్పటినుండి సాయి పల్లవికి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నారట ఆమె ఫ్యాన్స్. అలా చివరికి తండేల్ సినిమా విడుదలైన ఫస్ట్ రోజే ఆమెకు సంబంధించిన భారీ కటౌట్ ని వైజాగ్ సంగం థియేటర్ (Sangam Theatre ) వద్ద ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సాయి పల్లవి భారీ కటౌట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసి చాలామంది సాయిపల్లవి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి కొంతమందేమో షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ హీరోయిన్ కు కూడా ఇలాంటి కటౌట్ పెట్టలేదు. అలా సాయి పల్లవి (Sai Pallavi)కి సంబంధించి భారీ కటౌట్ ఫస్ట్ టైం పెట్టడంతో అరుదైన గౌరవం అందుకున్న మొదటి హీరోయిన్ గా సాయి పల్లవి పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. ప్రస్తుతం సాయి పల్లవి కటౌట్ కి సంబంధించిన ఫోటోలు,వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×