Sai Pallavi:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది సాయి పల్లవి (Sai Pallavi). శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన ఫిదా (Fidaa )సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి, మొదటి సినిమాతోనే పక్కా తెలంగాణ అమ్మాయిలా నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ఇక తర్వాత సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ మరింత పాపులారిటీ అందుకున్న ఈమె, ఒకవేళ పాత్ర నచ్చకపోతే అవతల ఉన్నది ఎంతటి వారైనా సరే సున్నితంగా రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. అసలేమైందో ఇప్పుడు చూద్దాం.
వరుస సినిమాలతో బిజీగా మారిన విక్రమ్..
నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల శివ కార్తికేయన్ (Shiva Karthikeyan)తో కలిసి ‘అమరన్’ సినిమా చేసిన ఈమె, ఇప్పుడు నాగచైతన్య (Naga Chaitanya) తో కలిసి ‘తండేల్’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి చందు మొండేటి (Chandu mondeti) దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సాయి పల్లవికి ఒక సినిమాలో అవకాశం రావడంతో ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. డైరెక్టర్ అరుణ్ కుమార్ (Arun Kumar)దర్శకత్వం వహించిన చిత్రం ‘వీర తీరచ్ సూరన్’. విక్రం (Vikram)హీరోగా నటించిన ఈ చిత్రంలో తుషారా విజయన్, ఎస్ జె సూర్య కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జనవరి 31వ తేదీన విడుదల కానున్నట్లు సమాచారం. మొత్తం రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా రెండవ భాగం ప్రస్తుతం విడుదలైంది. ఈ సినిమా విజయం తర్వాత మొదటి భాగాన్ని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మొదట ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ కొన్ని కారణాలవల్ల వాయిదా వేశారు.
విక్రమ్ సినిమాను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..
ఇదిలా ఉండగా విక్రమ్ తదుపరి సినిమాను డైరెక్టర్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవిని సంప్రదించగా.. ఆమె డేట్స్ కి కాల్ షీట్ లేకపోవడంతో సినిమాలో నటించే అవకాశాన్ని సున్నితంగా వదులుకుందట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభం కాగా.. ఈ సినిమా కోసం నటీనటుల వేటలో పడ్డారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వేసవి నుండి ప్రారంభం కాబోతుందని సమాచారం. ఇకపోతే సాయి పల్లవి రిజెక్ట్ చేయడంతో విక్రమ్ సరసన మరో హీరోయిన్ ప్రియాంక మోహనన్ (Priyanka Mohanan) ను సెలెక్ట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈమెను అయినా ఫైనల్ చేస్తారా? లేక ఇంకెవరినైనా హీరోయిన్ గా పెడతారా? అన్నది చూడాలి. ఇకపోతే విక్రమ్ చివరిగా విడుదలైన చిత్రం తంగలాన్. దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది. అటు థియేటర్లలో ఇటు ఓటిటిలో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఇప్పుడు రాబోయే చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.