MS Dhoni: ప్రశాంతతకు మరో పేరు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని. ఈ పేరుకి క్రికెట్ చరిత్రలో చెరిగిపోని ముద్ర ఉంది. భారత క్రికెట్ టీమ్ కి ఎన్నో విజయాలను అందించి నెంబర్ వన్ స్థానంలో నిలపడంలో ధోనీ పాత్ర చెప్పలేనిది. అందుకే ధోని క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ కి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Also Read: Yog Raj on Yuvraj Singh: గ్రౌండ్ లోనే యువీ చనిపోయినా గర్వపడేవాడిని !
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్న ధోని.. ఓ ప్లేయర్ గా మాత్రమే ఆ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ – 2025 సీజన్ లో మరోసారి మైదానంలో సందడి చేయనున్నాడు మహేంద్రసింగ్ ధోని. వాస్తవానికి ఐపీఎల్ 2024 సీజన్ తోనే ధోని క్రికెట్ కి గుడ్ బై చెబుతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అన్క్యాప్డ్ కోటాలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అతడిని రిటైన్ జాబితాలో దక్కించుకుంది.
దీంతో మరో సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు ధోని. మహీని మరోసారి స్టేడియంలో చూస్తామని ఆయన అభిమానులు ఎంతో సంతోషంలో ఉన్నారు. కానీ కొందరు మాత్రం ధోని ఫిట్నెస్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 43 ఏళ్ల ధోని మైదానంలో మునుపటిలా చురుగ్గా కదలగలడా..? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ ప్రశ్నలన్నింటినీ పటాపంచాలు చేసే విధంగా తాజాగా ధోనీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ధోనీకి క్రికెట్ మాత్రమే కాకుండా చాలా గేమ్స్ వచ్చు. అతడు స్వతహాగా ఫుడ్ బాల్ గోల్ కీపర్. ఆ తర్వాతే ధోని క్రికెటర్ గా మారారు. క్రికెట్ మైదానంలో హెలికాప్టర్ షాట్స్ తో దుమ్ము లేపే ఈ కెప్టెన్ కూల్.. టెన్నిస్ కోర్టులోను సత్తా చాటుతాడన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ధోని మరోసారి టెన్నిస్ ఆడుతున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఏజ్ అతనికి కేవలం నెంబర్ మాత్రమేనని.. ధోని ఎక్కడైనా సత్తా చాటగలడని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ధోని తనకు క్రికెట్ తో పాటు టెన్నిస్ అంటే కూడా చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పాడు. సమయం దొరికినప్పుడల్లా టెన్నిస్ కోర్టులోనే సమయం గడుపుతాడు ధోని. ఈ క్రమంలోనే ధోని టెన్నిస్ ఆడుతున్న ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే విమర్శకులు సైతం ధోని ఫిట్నెస్ ని చూసి.. అతడు ఇప్పుడప్పుడే క్రికెట్ కి దూరం కాలేడని కితాబిస్తున్నారు.
THALA DHONI PLAYING TENNIS AT HIS HOME-TOWN 🎾 pic.twitter.com/v4UNY6amcH
— Johns. (@CricCrazyJohns) January 13, 2025