BigTV English

Saipallavi: సక్సెస్ అంటే ఇదే..చదివిన స్కూల్ కి గెస్ట్ గా సాయి పల్లవి..!

Saipallavi: సక్సెస్ అంటే ఇదే..చదివిన స్కూల్ కి గెస్ట్ గా సాయి పల్లవి..!

Saipallavi:సాయి పల్లవి (Sai Pallavi).. ఈ పేరు చెప్పగానే ఎంతోమంది యూత్ కి సాయి పల్లవి అందమైన రూపం గుర్తుకొస్తుంది. ఆమె ఎలాంటి మేకప్ లు వేసుకోకున్నా. గ్లామరస్ పాత్రల్లో నటించకున్నా కూడా ఈమెకు డై హార్డ్స్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇప్పటి జనరేషన్ హీరోయిన్ లు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ ఎక్స్పోజింగ్ చేస్తేనే అభిమానులు పెరుగుతారు, ఎక్కువ మంది దృష్టిలో పడతాము అనుకుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం వీటన్నింటికీ చాలా దూరంగా ఉంటుంది. తన ప్రవర్తన, నటనతోనే ప్రేక్షకుల్లో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తాను చదివిన స్కూల్ కి గెస్ట్ గా వెళ్లి సక్సెస్ అంటే ఇది అని అందరూ గొప్పగా చెప్పుకునేలా చేసింది. అంతేకాదు తన మాటలతో ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యేలా చేసింది. మరి ఇంతకీ సాయి పల్లవి ఎక్కడ చదువుకుంది? అనేది ఇప్పుడు చూద్దాం..


తాను చదువుకున్న స్కూల్ కి గెస్ట్ గా వెళ్లిన సాయి పల్లవి..

సాయి పల్లవి తన స్కూల్ డేస్ మొత్తాన్ని తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఉండే “అవిలా కాన్వెంట్ స్కూల్” లో పూర్తి చేసింది. అయితే ఎక్కడైతే సాయి పల్లవి చదువుకుందో ఆ స్కూల్ కే మళ్ళీ సాయి పల్లవి గెస్ట్ గా వెళ్ళింది. ఇక స్కూల్ ఈవెంట్లో గెస్ట్ గా పాల్గొన్న సాయి పల్లవి మాట్లాడిన మాటలు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి. మరి ఇంతకీ సాయి పల్లవి ఏం మాట్లాడింది అంటే.. “ఈ స్కూల్ లో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటన్నింటిని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఈ స్కూల్లో ఎక్కువగా నచ్చింది ఆడిటోరియం మాత్రమే.. ఎందుకంటే చాలాసార్లు క్లాసులు ఎగ్గొట్టి మరీ ఈ ఆడిటోరియంలో గడిపిన సందర్భాలు ఉన్నాయి. అలాగే నాకు డాన్స్ చేయడం అంటే ఎక్కువ ఇష్టం. కాబట్టి ఆడిటోరియంలో ఎక్కువగా గడిపేదాన్ని. అందుకే చిన్నప్పటినుండే నాకు స్టేజ్ ఫియిర్ కూడా లేదు.నేను ఈ ఆడిటోరియం ని మిస్ అయ్యి దాదాపు 12 ఏళ్లు గడిచిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఏజ్ లో ఎంతోమంది మన ఫోకస్ మార్చి చెడు తిరుగుళ్ళు తిరిగేలా చేస్తారు. కానీ మన దృష్టి అలాంటి వాటిపై పడకూడదు. ఇక ఆ ఏజ్ లో నా దృష్టి అలాంటి వాటిపైకి వెళ్లకుండా నా పేరెంట్స్ నాకు ఎంతగానో సాయం చేశారు.


విద్యార్థులతో సాయి పల్లవి అలాంటి కామెంట్స్..

అలాగే ఇంత మంచి స్కూల్,నా పేరెంట్స్ కారణంగా నేను ఎలాంటి చెడు అలవాట్ల దరికి కూడా పోలేదు. నా పూర్తి ఫోకస్ మొత్తం చదువు పైనే పెట్టేసాను. ఈ స్కూల్లో చదువు మాత్రమే కాదు డాన్స్ కూడా నేర్చుకున్నాను. అందుకే నా ఫుల్ ఫోకస్ డ్యాన్స్,చదువు మీదే ఉండేది.అంతేకాకుండా ఈ స్కూల్ ద్వారా నేను ఎదుటివారితో ఎలా ఉండాలి. ఎంత క్రమశిక్షణగా మెదలాలి.. అనేది కూడా నేర్చుకున్నాను. ఒక మనిషిగా ఎలా ఉండాలి అనేది మొట్టమొదటిసారి నేర్చుకున్నది ఈ స్కూల్ ద్వారానే.ఈ స్కూల్లోనే పెద్దయాక నేను ఏమి అవ్వాలి? నా గోల్ ఏంటి అనేది? తెలుసుకొని నాతో నేను ఎన్నోసార్లు లోలోపల మాట్లాడుకున్నాను”. అంటూ సాయి పల్లవి తన స్కూల్ లైఫ్ మొత్తాన్ని తన స్కూల్లో జరిగిన ఈవెంట్ లో అక్కడున్న స్టూడెంట్స్ తో పంచుకుంది.అలా తన స్కూల్ డేస్ జ్ఞాపకాలని సాయి పల్లవి చెబుతూ ఉంటే వినేవారికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే చాలామంది ఆ ఏజ్ లో చెడు తిరుగుళ్ళు తిరుగుతూ వారి గోల్ మొత్తాన్ని పక్కన పెడతారు. కానీ సాయి పల్లవి మాత్రం అలాంటి వాటికి అలవాటు పడకుండా తన చదువేదో తాను చదువుకొని మళ్లీ తాను చదువుకున్న స్కూల్ కే అతిథిగా వచ్చింది అంటే ఆమె ఎంత సక్సెస్ అందుకుందో చెప్పనక్కర్లేదు. ఎవరికైనా సరే చదువుకున్న స్కూల్ కే మళ్ళీ గెస్ట్ గా వచ్చే అవకాశం వస్తే అదే లైఫ్ లో అతిపెద్ద సక్సెస్ అని అంటున్నారు. సాయి పల్లవిని చూసిన జనాలు.. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది అమరన్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో మన ముందుకు వచ్చింది. అలాగే మరికొద్ది రోజుల్లో తండేల్ మూవీతో పలకరించబోతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×