BigTV English

Australian Open 2025 Final: ఆస్ట్రేలియా ఓపెన్ – 2025 విజేతగా ఇటలీకి చెందిన సినర్

Australian Open 2025 Final: ఆస్ట్రేలియా ఓపెన్ – 2025 విజేతగా ఇటలీకి చెందిన సినర్

Australian Open 2025 Final: ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ని టాప్ సీడ్ సీనర్ ( ఇటలీ) సొంతం చేసుకున్నాడు. జనవరి 26 ఆదివారం రోజు జరిగిన ఫైనల్ లో అలెగ్జాండర్ జ్వారెవ్ పై వరుస సెట్లలో గెలుపొంది ఛాంపియన్ గా అవతరించాడు. మేల్ బోర్న్ లోని రాడ్ లేవర్ ఎరీనాలో నేడు జరిగిన ఫైనల్ లో జ్వారెవ్ ( జర్మనీ) పై 6 – 3, 7- 6 (4) 6 -3 తేడాతో గెలుపొందాడు. సీనర్ కి ఇది మూడవ గ్రాండ్ స్లామ్ (2 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్, ఒక యుఎస్ ఓపెన్) టైటిల్.


AlsoRead: Paarl Royals: మీ దుంపతెగ.. 20 ఓవర్లు స్పిన్నర్లే వేసారా.. రూల్స్‌ బ్రేక్‌ చేసినట్లేనా ?

ఇతడు గతేడాది డానిల్ మెద్వేదేవ్ ని ఓడించి విజేతగా నిలిచాడు. అంతేకాదు ఇతడు వరుసగా రెండు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ గెలిచిన తొలి ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మెద్వేదేవ్ పై ఐదు సెట్ల పోరులో సీనర్ విజయం సాధించాడు. టాప్ సీడ్ గా ఎన్నో అంచనాల మధ్య ఈ టోర్నీలోకి అడుగుపెట్టిన సీనర్.. ఫైనల్స్ లో కూడా అదే జోరుని కొనసాగించాడు. తొలి సెట్ లో 8వ గేమ్ లో జ్వారెవ్ సర్వీస్ బ్రేక్ చేసి 5-3 ఆదిక్యంలోకి దూసుకు వెళ్ళాడు.


10వ గేమ్ లో తన సర్వీస్ నిలబెట్టుకొని 6 – 4 తేడాతో తొలి సెట్ నెగ్గాడు. రెండవ సెట్ లో జ్వారెవ్ ప్రతిఘటించడంతో సెట్ టై బ్రేక్ కి దారి తీసింది. ఇక టైం బ్రేక్ లో 4-4 తో సమంగా ఉన్న సమయంలో వరుసగా మూడు పాయింట్స్ గెలిచి రెండవ సెట్ కైవసం చేసుకున్నాడు. అనంతరం మూడవ సెట్ లోను అదే హవా కొనసాగించి ఆరవ గేమ్ లో జ్వారెవ్ సర్వీస్ బ్రేక్ చేసి 4-2 ఆదిక్యంలోకి వెళ్ళాడు.

ఇక చివరి రెండు సర్వీస్ లను నిలబెట్టుకొని 6 – 4 తేడాతో సెట్ తో పాటు మ్యాచ్, టైటిల్ ని కైవసం చేసుకున్నాడు. మరోవైపు తొలి మూడు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ లో ఓడిన ఆరవ ఆటగాడిగా అలెగ్జాండర్ జ్వారెవ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. జ్వారెవ్ ఫైనల్ కీ చేరే క్రమంలో అద్భుతంగా ఆడి.. ఫైనల్ లో మాత్రం తేలిపోయాడు. ఈ మ్యాచ్ లో సీనర్ మొత్తంగా 6 ఏస్ లు కొడితే.. జ్వారెవ్ ఏకంగా 12 ఏస్ లు కొట్టడం గమనార్హం.

AlsoRead: ICC Under 19 Womens T20 World Cup: టీమిండియా మరో విజయం.. వరుసగా మూడోది

కానీ మ్యాచ్ లో పదేపదే అనవసర తప్పిదాలు చేస్తూ మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు శనివారం రోజు జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల ఫైనల్ పోరులో అమెరికా టెన్నిస్ స్టార్ మాడిసన్ కీస్ విజయం సాధించింది. శనివారం రోజు జరిగిన తుది పోరులో 29 ఏళ్ల మాడిసన్ కీస్.. ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిని బెలారస్ టెన్నిస్ దిగ్గజం సెబలెంకను ఓడించి విజయం సాధించింది. ఇది మాడిసన్ కీస్ కి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం గమనార్హం.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×