Sai Rajesh.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సోదరుడు ప్రముఖ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand deverakonda), విరాజ్ (Viraj) ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం బేబీ(Baby ). ఇందులో ప్రముఖ యూట్యూబ్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్గా నటించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు ఇందులో నటించిన నటీనటులకు , ఈ చిత్ర దర్శకుడికి, నిర్మాతలకు కూడా మంచి పేరు లభించిందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు. ఇదిలా ఉండగా సాయి రాజేష్ కి ఒక నిర్మాత ఖరీదైన వాచ్ బహుమతిగా ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.
సాయి రాజేష్ కి నిర్మాత ధీరజ్ ఖరీదైన గిఫ్ట్ బహుకరణ
సాధారణంగా సినిమాలు సక్సెస్ అయినా.. లేదా ఏదైనా స్పెషల్ డేస్ అయినా సరే నిర్మాతలు.. హీరోలకు లేదా దర్శకులకు ఏదో ఒక కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు హీరోలు కూడా తమకు మంచి సినిమాలను అందిస్తే ఆ దర్శకులకు , మూవీ యూనిట్స్ కి ఖరీదైన గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇలా అందజేసే ప్రత్యేకమైన గిఫ్ట్స్ లలో ఎక్కువగా కార్లు, వాచ్లే ఉంటాయి. ఈ క్రమంలోనే నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు దక్కించుకున్న ధీరజ్ మొగిలినేని(Dheeraj Mogilineni) తాజాగా బేబీ దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh) కి ఖరీదైన బహుమతిని అందించారు. అది ఏదో కాదు వాచ్.ఇప్పుడు ఏ స్పెషల్ డే , సినిమా లేకపోయినా ఈ గిఫ్ట్ ఇవ్వడం గమనార్హం.
Shraddha Kapoor: పెళ్లికి సిద్ధమైన శ్రద్ధ.. వాల్ పేపర్ లీక్..!
వాచ్ ఖరీదు ఎంత అంటే..?
వాచ్ విషయానికి వస్తే.. టాగ్ హెయూర్ కంపెనీ ఫార్ములా వన్ మోడల్ కి చెందింది వాచ్. దీని ఖరీదు అక్షరాల 1 లక్ష 83 వేల రూపాయల నుండి రూ.2.04లక్షల పైనే ఆన్లైన్లో చూపిస్తోంది.. ఇకపోతే నిర్మాతగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న ఈ యువ నిర్మాత.. డైరెక్టర్ కి ఇంత ఖరీదైన వాచ్ ఇవ్వడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక వీరిద్దరి కాంబోలో ఫ్యూచర్లో ఒక సినిమా రాబోతోందా? లేక స్నేహంతోనే ఈ గిఫ్ట్ ఇచ్చారా?అన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే ధీరజ్ ఈ వాచ్ ను గిఫ్ట్ గా ఇస్తున్న ఫోటోని సాయి రాజేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి..”మా నిర్మాత నుంచి ఖరీదైన గిఫ్ట్” అంటూ రాసుకువచ్చారు. మొత్తానికైతే ధీరజ్ సాయి రాజేష్ కి ఇచ్చిన ఈ కాస్ట్లీ వాచ్ చాలా వైరల్ గా మారగా.. దాని లుక్కు కూడా బాగుంది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
సాయి రాజేష్ కెరియర్
సాయి రాజేష్ విషయానికి వస్తే.. కథ రచయితగా ,దర్శకుడిగా పేరు దక్కించుకున్న ఈయన 2014లో సంపూర్ణేష్ బాబు(Sampoornesh babu) హీరోగా వచ్చిన ‘హృదయ కాలేయం’ అనే సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 2023లో బేబీ సినిమాతో దర్శకుడిగా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక కొబ్బరి మట్ట సినిమాకి రచయితగా, నిర్మాతగా వ్యవహరించిన ఈయన .. ‘కలర్ ఫోటో’ సినిమాకి కూడా ఈయనే కథ అందించడం గమనార్హం. బేబీ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా 2023లో ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ ను దక్కించుకున్నారు.