BigTV English

Nindu Noorella Saavasam Serial Today March 4th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజును చంపబోయిన మనోహరి – రూంలోకి వెళ్లిన మిస్సమ్మ  

Nindu Noorella Saavasam Serial Today March 4th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజును చంపబోయిన మనోహరి – రూంలోకి వెళ్లిన మిస్సమ్మ  

Nindu Noorella Saavasam Serial Today Episode :  తోటమాలిని వేషంలో ఉన్న చిత్రగుప్తుడు ఆరును తిడుతుంటాడు. ఇంతలో విచిత్రగుప్తుడు వస్తాడు. దీంతో చిత్రగుప్తుడు ఆశ్చర్యంగా నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు.. ప్రభువుల వారికి నిజం చెప్పావా…? ఆయనను తీసుకుని వచ్చావా..? అని అడుగుతాడు. దీంతో నేను నీలా స్వార్థపరుడిని కాదలే చిత్రగుప్తుల వారు. తమరు మా స్థానమును చేజికించుకోవడానికి మీరు చేసిన ప్రయత్నములు అన్ని నాకు తెలుసు. అయినా నేను నీకు మంచి చేయుటకే వచ్చాను అని చెప్తాడు. దీంతో చిత్రగుప్తుడు కోపంగా నీ మాయ మాటలు మూట కట్టుకో ఆ బాలికతో పన్నాగం పన్ని.. నాతోనే ఆ బాలికను భూలోకం తీసుకువచ్చేలా చేసింది నువ్వేనని నాకు తెలియదు అనుకుంటివా..? ముందు తమరు ఎందుకు విచ్చేశారో అది తెలపండి అంటాడు. దీంతో ప్రభువు వారు తమరి కోసం వెతుకుతున్నారు. యమభటులు మీ కోసం యమలోకం మొత్తం వెతుకుతున్నారు.


తమరు ఇక్కడ ఉన్నారని ప్రభువుల వారికి తెలిసినచో.. మీరు శాశ్వతంగా ఇక్కడనే ఆ చెట్టు కింద సేద తీరతారు అని విచిత్రగుప్తుడు చెప్పగానే.. చిత్రగుప్తుడు అయితే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పుము అంటాడు. దీంతో నేను ఆ బాలికను తీసుకొని వచ్చెదను..  మీరు వెంటనే యమలోకం వెళ్లండి.. అని విచిత్రగుప్తుడు చెప్పగానే.. వెళ్తాను కానీ ఆ అనామికకు తన పిల్లపిచ్చుక ప్రమాదంలో ఉందని తెలియజేయవలెను అంటాడు. దీంతో ప్రమాదమా..? ఏం జరిగింది అని విచిత్రగుప్తుడు అడగ్గానే.. జరిగింది మొత్తం చెప్తాడు చిత్రగుప్తుడు. దీంతో ఆ పిల్లపిచ్చుకను కాపాడేది ఆత్మ మాత్రమే.. మనం ఈ సమాచారం ఆ ఆత్మకు తెలియజేయవలెను అప్పుడు ఆ బాలికే అంతా చూసుకుంటుంది అని చెప్తాడు విచిత్రగుప్తుడు.

అంజు బెడ్‌ మీద పడుకుని ఉండగా డాక్టర్‌ వచ్చి టెస్ట్‌ చేస్తుంటాడు. అమ్ము ఏడుస్తూ అంజుకు ఏమైంది మిస్సమ్మ అని అడుగుతుంది. అంజుకు ఏం కాదు నువ్వేం భయపడకు అమ్ము అని భరోసా ఇస్తుంది. డాక్టర్‌ పిలవగానే.. అంజు మెల్లగా కళ్లు తెరుస్తుంది. కళ్లు తెరుస్తూనే.. మనోహరి కత్తితో పొడవడం గుర్తు చేసుకుని మమ్మీ, డాడీ అని గట్టిగా అరుస్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. డాక్టర్‌ ఇంజక్షన్‌ ఇవ్వగానే.. మెల్లగా నిద్రలోకి వెళ్తుంది. మిస్సమ్మ డాక్టర్‌ పాప కళ్లు తెరుస్తుంది. కానీ ఎందుకో ఇలా అరుస్తుంది అని అడుగుతుంది. అమర్‌ కూడా ఎంత అడిగినా ఏమీ చెప్పడం లేదు డాక్టర్‌ అంటాడు. దీంతో డాక్టర్‌ పాప ఏదో చూసి భయపడింది అమరేంద్ర గారు అని చెప్తాడు.


మనోహరి షాకింగ్‌గా నేను కాళీని పొడవడం చూసేసింది. కన్ఫంగా ఆ పొట్టిది కళ్లు తెరిస్తే.. అమర్‌కు నిజం చెప్పేస్తుంది అని మనసులో భయపడుతుంది. డాక్టర్‌ మాత్రం కళ్లు తెరవడానికి ప్రయత్నించిన ప్రతిసారి కళ్ల ముందు అదే కనిపించగానే మళ్లీ అందుకే ఇలా అరుస్తుంది అని చెప్తాడు. ఇంతలో అనామిక నిన్న  నైట్‌ ఇంట్లోంచి చాలా యాక్టివ్‌గా వెళ్లింది. రణవీర్‌ గారి ఇంట్లోనే ఏదో జరిగి ఉండాలి అంటుంది. దీంతో రాథోడ్‌ అందరం వెళ్లాము.. డిన్నర్‌ చేశాం వచ్చేశాం అంటాడు. దీంతో మిస్సమ్మ లేదు రాథోడ్‌ అనామిక గారు చెప్పినట్టు అక్కడ ఏదో జరిగింది. అంటే అంజు నిద్రలో దొర్లుకుంటూ కిందపడలేదు. తను అక్కడ ఏదో చూసి స్పృహ తప్పి పడిపోయిందన్నమాట అంటుంది. దీంతో నిర్మల ఏడుస్తూ  పాపం భయంతో ఎంత కంగారు పడిపోయిందో ఏంటో..? దేవుడా.. ఎందుకయ్యా నా కుటుంబానికే ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అంటుంది. డాక్టర్‌ జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతాడు.

ఇంతలో శివరాం అనుమానంగా అమర్‌ అంజు చాలా గట్టి పిల్ల అక్కడ ఏం చూసి ఉంటే.. ఇంతలా భయపడి ఉంటుంది అంటాడు. అదే నాకు అర్థం కావడం లేదు నాన్నా.. మేము అంజు కోసం వెళ్లినప్పుడు రణవీర్‌ నార్మల్‌ గానే ఉన్నారు. ఏదైనా జరిగి ఉంటే అలా ఉండేవారు కాదు కదా అంటాడు అమర్‌. ఇంతలో అనామిక మనోహరి గారు నిన్న మీరు సార్‌ వాళ్లు రణవీర్‌ వాళ్ల ఇంటికి వెళ్లారని తెలుసుకుని మీరు బయటికి వెళ్లారు కదా..? అప్పుడు మీరు అక్కడికి వెళ్లారా..? అని అనామిక అడగ్గానే మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతలో షాక్ నుంచి తేరుకున్న మనోహరి నేను వేరే పనుండి వేరే దగ్గరకు వెళ్లాను అని చెప్తుంది. అయితే రణవీర్‌ ఇంట్లో సీసీటీవీ పుటేజీ చూస్తే సరిపోతుంది కదా అని మిస్సమ్మ చెప్పగానే.. అమర్‌ అవునని వెళ్లి చూద్దాం పద రాథోడ్‌ అని చెప్తాడు.

తర్వాత రూంలోకి వెళ్లిన మనోహరి.. అమర్‌ సీసీటీవీ పుటేజీ చూడకుండా ఎలాగైనా అడ్డుకోవాలనుకుంటుంది. లేదంటే రణవీర్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పాలనుకుంటుంది. అంతకన్నా ముందు అంజలిని చంపేస్తే.. సగం పీడ వదులుతుందని ప్లాన్‌ చేస్తుంది. అందుకోసం అందరూ పడుకున్నాక అంజును చంపడానికి రూంలోకి వెళ్తుంది మనోహరి. అప్పుడే అ రూంలోకి మిస్సమ్మ వస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×