
Sai Dharam Tej :సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి బయట పడిన తర్వాత చేసిన సినిమా విరూపాక్ష. ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆయనకు రీ ఎంట్రీ మూవీ ఇది. అయితే సాయిధరమ్ తేజ్‌ను యాక్సిడెంట్ నుంచి కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ అనే డ్రైవర్‌ను అంత ఈజీగా ఎవరూ మరచిపోరు. ఈ డ్రైవర్‌కు మెగా హీరోలు సాయం చేశారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలను సదరు డ్రైవర్ ఫర్హాన్ ఖండించాడు.
అబ్దుల్ ఫర్హాన్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం అమెజాన్ కంపెనీలో కారు డ్రైవర్‌గా వర్క్ చేస్తున్నాను. అంతకు ముందు సీఎంఆర్ కంపెనీలో కారు డ్రైవర్‌గా ఉండేవాడిని. సాయిధరమ్ తేజ్‌ను కాపాడినందుకు ఇదిచ్చారు, అదిచ్చారు. చిరంజీవిగారు కలిశారని, పవన్ కళ్యాణ్‌గారు కలిశారని అంటూ ఫేక్ న్యూస్‌లను పుట్టించారు. నా ఫ్యామిలీ మెంబర్, ఫ్రెండ్స్ అందరూ ఆ వార్తలను విని నన్ను అడగటం మొదలు పెట్టారు. దాంతో నేను ఆ జాబ్ మానేశాను. నాలుగైదు నెలలు ఖాళీగా ఉన్నాను. తర్వాత సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని హబ్‌లో పెట్టుకుని డ్రైవర్‌గా పని చేసుకుంటున్నాను.
సోషల్ మీడియాలో చెబుతున్నట్లు సాయిధరమ్ తేజ్‌గారు నాకు అండగా ఉంటారని చెప్పినట్లు, సాయం చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్‌గారు నన్ను అసలు కలవలేదు. నాకు ఎవరూ ఎలాంటి సాయం చేయలేదు’’ అని క్లారిటీగా చెప్పేశాడు. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఫర్హాన్‌ను తాను కలిశానని, తన వాళ్ల నెంబర్ ఇచ్చానని, కచ్చితంగా సాయం చేస్తానని అన్నారు. కానీ ఇప్పుడు ఫర్హాన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ వార్తల్లో నిజం లేదని క్లియర్ కట్‌గా తెలుస్తోంది.