TDP vs YCP:
– బనగానపల్లెలో టెన్షన్ వాతావరణం
– కొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు
– ధర్నాకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే
నంద్యాల, స్వేచ్ఛ: బనగానపల్లెలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, వైసీపీ నేత అబ్దుల్ ఫయాజ్ వర్గీయులు ఘర్షణకు దిగారు. ముందుగా ఫయాజ్ కుమారుడి వివాహం నేపథ్యంలో డ్రోన్ కెమెరాను వాడారు. దీనిపై కొందరు అభ్యంతరం తెలిపి ఆపరేటర్‌పై దాడి చేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మండిపడ్డారు. ఫయాజ్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి కాంపౌండ్‌లోకి డ్రోన్ వెళ్లిందంటూ ఆపరేటర్లను కొట్టడం, అదే సమయంలో ఫయాజ్ కుటుంబంపైనా దాడి చేయడంపై మండిపడుతూ, తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నందినగర్‌లో బీసీ జనార్ధన్ రెడ్డి ఇల్లు ఉంటుంది. దానికి సమీపంలోనే వైసీపీ లీడర్ ఫయాజ్ నివాసం ఉంది. తన కుమారుడి పెళ్లి నేపథ్యంలో డ్రోన్ సాయంతో షూట్ చేయిస్తున్నారు. దీన్ని మంత్రి సెక్యూరిటీ గమనించారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. డ్రోన్ కెమెరాలను ధ్వంసం చేశారు.
Also Read: TRS to BRS: కారు ఎంతపనిచేసింది.. అప్పటినుంచే KCRకు బ్యాడ్ టైమ్.. కారు రేసులోనే ఇరుక్కున్న KTR
పెళ్లి ఇంటి దగ్గర భయబ్రాంతులకు గురి చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మంత్రి అనుచరులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు కూడా ప్రయత్నించారు.