BigTV English

Salaar Advance Booking : ప్రభాస్ బ్రాండ్ ఇమేజ్ అదుర్స్ .. బుకింగ్స్ తో ‘సలార్’ సంచలన రికార్డు

Salaar Advance Booking : ప్రభాస్ బ్రాండ్ ఇమేజ్ అదుర్స్ .. బుకింగ్స్ తో ‘సలార్’ సంచలన రికార్డు
Salaar

Salaar Advance Booking : డార్లింగ్ ప్రభాస్ సలార్ చిత్రం కోసం అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్ నెలకొని ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఒక సునామీలా ముందుకు సాగుతున్నాయి. కేవలం ఓవర్సీస్ లోనే 1.4 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ను ఇప్పటికే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. ఈ సంవత్సరానికి ఇది రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్ కావడం విశేషం.


ట్రైలర్స్ తో ఈ మూవీ పై అంచనాలను అమాంతం పెంచేశారు మేకర్స్. ప్రమోషన్స్ కి భారీ హంగులు లేకుండా కూడా కంటెంట్ సాలిడ్ గా ఉంటే ప్రేక్షకులలోకి తీసుకువెళ్లడం సులభమే అని నిరూపించారు సలార్ బృందం. మన దేశం సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఏకంగా 35.25 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. ఇప్పటివరకు ఏ చిత్రానికి ఇంత భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు అనడంలో ఎటువంటి డౌట్ లేదు.

ఆంధ్రాలో సుమారు 13.25 లక్షల టికెట్లు , నైజాం ఏరియాలో ఆరు లక్షల టికెట్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అమ్ముడైపోయాయి. కర్ణాటకలో 3.25 లక్షలు,కేరళలో 1.5 లక్షల,తమిళనాడులో 1 లక్ష టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. అయితే ఇవన్నీ మల్టీప్లెక్స్ చైన్ థియేటర్స్ పీవీఆర్, ఐనాక్స్,సినిపోల్స్ టికెట్ బుకింగ్ పరిగణలోకి తీసుకోకుండా వచ్చిన లెక్కలు. ఈ విధంగా చూస్తే ఒక్క ఓపెనింగ్ రోజు సుమారు 200 కోట్ల వరకు సలార్ నికరంగా కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది.


ఇప్పటివరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం కేవలం ప్రభాస్ బ్రాండ్ ఇమేజ్ ,ప్రశాంత్ నీల్ ట్రేడ్ మార్క్ మీద జరిగాయి అని టాక్. ఇక మూవీ విడుదల అయ్యాక..స్టోరీ కనెక్ట్ అయితే.. బుకింగ్స్ జోరు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఓపెనింగ్ బుకింగ్స్ తోనే సునామీ సృష్టించిన సలార్ తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×