BigTV English

Salaar Record: 2023 హైయెస్ట్ గ్రాస్ ఓపెనింగ్స్.. సలార్ సంచలన రికార్డ్..

Salaar Record: 2023 హైయెస్ట్ గ్రాస్ ఓపెనింగ్స్.. సలార్ సంచలన రికార్డ్..

Salaar Record: ప్రతి సంవత్సరం కొన్ని వందల సంఖ్యలో సినిమాలు వస్తుంటాయి. అయితే వాటిలో మెప్పించి మనసు దోచుకునే సినిమాలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్స్ నెలకొల్పిన సినిమాలైతే వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఇండియన్ సినిమాలలో వరల్డ్ వైడ్ గ్రాస్ ఓపెనింగ్స్ విషయంలో టాప్ మూవీగా సలార్ నిలిచింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. బాహుబలి తర్వాత ప్రభాస్ మూవీ తిరిగి ఆ స్థాయిలో కలెక్షన్స్ సాధించడం అంటే సలార్ తోటే కుదిరింది.


బాహుబలి మూవీ తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చిన సాహో, రాధేశ్యామ్ భారీ డిజాస్టర్ గా మిగిలాయి. ఈ నేపథ్యంలో రాముడి కథ ఆధారంగా తెరకెక్కించిన ఆది పురుష్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఊహించినట్టే మంచి ఓపెనింగ్స్ తో మొదలైనప్పటికీ అనుకోకుండా వివాదాల్లో చిక్కుకోవడం వల్ల ఆ చిత్రం థియేటర్లలో తడబడింది. ఆ రకంగా ప్రభాస్ ఖాతాలో ఒక సూపర్ హిట్ మిస్సయిందనే చెప్పవచ్చు. ఇక ఆ తరువాత ప్రభాస్ అభిమానులు సలార్ పై తమ ఆశలన్నీ పెట్టుకున్నారు. మరోపక్క ప్రభాస్ పని అయిపోయిందన్న రూమర్స్ కూడా ఎక్కువవుతూ వచ్చాయి.

కామెంట్స్ ఎంత షార్ప్ గా వచ్చాయో అంతకంటే వేగంగా సలార్ మూవీ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. విడుదల అయిన ఫస్ట్ డే నుంచి సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా.. కలెక్షన్స్ పరంగా కూడా దూసుకు వెళ్తోంది. ఈ చిత్రానికి సంబంధించి వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ సంచలనం అనే చెప్పాలి. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం పదండి..


కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన సలార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాతో గత కొద్ది కాలంగా డార్లింగ్ మాస్ భీభత్సరం చూడాలి అని తహతలాడుతున్న అభిమానుల ఆకలి ప్రభాస్ తీర్చాడు. మొదటి రోజే ఈ చిత్రం 178 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనమైన రికార్డును నెలకొల్పింది. 2023 ఇండియన్ సినిమాలలో ఈ రేంజ్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఓపెనింగ్స్ మరే చిత్రానికి లేవు. దీంతో ఈ సంవత్సరం భారీ ఓపెనింగ్ సాధించిన టాప్ మూవీగా సలార్ నిలిచింది.

ఆ తర్వాత స్థానంలో విజయ్ నటించిన లియోచిత్రం 146 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ తో రెండవ స్థానంలో నిలిచింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచి మంచి వసూళ్లే రాబట్టింది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఓం రౌత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆది పురుష చిత్రం 137 కోట్ల భారీ ఓపెనింగ్స్ తో మూడవ స్థానంలో ఉంది. నాలుగవ స్థానంలో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ 126 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఐదవ స్థానంలో 105 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ తో షారూక్ నటించిన పఠాన్ చిత్రం ఉంది.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×