BigTV English

Salaar: కాటేరమ్మ కొడుకుని చూడడానికి క్యూ కడుతున్నారు…

Salaar: కాటేరమ్మ కొడుకుని చూడడానికి క్యూ కడుతున్నారు…

Salaar: సలార్ రీరిలీజ్‌ తో ప్రభాస్‌ను మాస్ యాక్షన్ అవతార్‌లో మరోసారి చూడడానికి ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. మార్చి 21న సలార్ థియేటర్లలోకి వస్తుండడంతో, టికెట్ బుకింగ్స్ ఎప్పుడూ లేనివిధంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. రీరిలీజ్ అయినా సరే, సినిమా మీద క్రేజ్ మాత్రం కొత్త సినిమా విడుదలైనంత రేంజ్‌లో ఉంది. అసలు ఒక ఫుల్ కమర్షియల్ యాక్షన్ సినిమా రీరిలీజ్‌కి ఇంత హైప్ రావడం చాలా అరుదు. ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్, ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ కలిసొచ్చిన ఈ కాంబో ఇప్పుడు మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.


ప్రభాస్ కెరీర్‌కి బాహుబలి రెండు భాగాలు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. అయితే, ఆ తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు అభిమానులకు అంతగా సంతృప్తిని కలిగించలేకపోయాయి. సాహో లో యాక్షన్ భారీగా ఉన్నా, కథాపరంగా కొంత మిస్సయ్యింది. రాధే శ్యామ్ లో ప్రభాస్ కొత్త లుక్ లో కనిపించినా, మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో వెనుకబడ్డాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఫ్యాన్స్ కోసం ఓ పవర్‌పుల్ మాస్ మసాలా సినిమా అవసరం అనిపించింది. ఆ అవసరాన్ని తీర్చిందే సలార్.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ ప్రభాస్‌ని ఒక కొత్త లెవెల్‌లో చూపించింది. యశ్‌ను KGF ద్వారా మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ చేసిన ప్రశాంత్, అదే మేజిక్‌ను సలార్‌లో కూడా రిపీట్ చేశాడు. అయితే, ఈసారి స్కేల్ మరింత పెరిగింది. సలార్ లో ప్రభాస్ లుక్స్, బాడీ లాంగ్వేజ్, ఫైటింగ్ స్టైల్ పూర్తిగా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా రఫ్ అండ్ రగ్డ్ మాస్ లుక్‌లో కనిపించాడు. బ్లాక్ కలర్ కాస్ట్యూమ్స్, ఎలివేషన్ డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి సినిమా మొత్తానికి మాస్ వాతావరణాన్ని క్రియేట్ చేశాయి.


కాటేరమ్మ కొడుకు సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సీన్ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. క్లైమాక్స్‌లో ప్రభాస్ యాక్షన్ మోడ్‌లోకి మారే సీన్ చూసిన అభిమానులు థియేటర్‌లో సీట్లు ఎగరేసినంత పని చేశారు. కాటేరమ్మ కొడుకు అంటూ వచ్చే ఈ ఎలివేషన్ సీన్‌లోని డైలాగ్స్ ఇప్పటికీ అభిమానులకు ఫేవరెట్. యాక్షన్ లవర్స్ కోసం ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన ఈ మాస్ ఎలివేషన్ కచ్చితంగా ఈ రీరిలీజ్‌లో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వబోతుంది.

సలార్ పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 మీద అంచనాలు అమాంతం పెరిగాయి. శౌర్యంగాపర్వం టైటిల్‌తో రాబోయే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. పార్ట్ 1 పూర్తిగా మాస్ యాక్షన్ మోడ్‌లో సాగితే, పార్ట్ 2 మరింత డార్క్, ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందనే టాక్ ఉంది. ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ మళ్లీ ఏ రేంజ్ లో దుమ్ముదులిపేందుకు ప్లాన్ చేస్తున్నారు అనే విషయంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటివరకు ఎన్నో రీరిలీజ్‌లు చూశాం, కానీ సలార్ రీరిలీజ్‌కు వస్తున్న బజ్ మాత్రం ఏ రేంజ్‌లో ఉందంటే, ఇది ఓ కొత్త సినిమా విడుదలకంటే తక్కువ కాదు. టికెట్ బుకింగ్స్ విపరీతంగా జరగడం, మల్టీప్లెక్స్ లలో హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడడం చూస్తుంటే, ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మార్చి 21 నుంచి థియేటర్లు ప్రభాస్ వేట కోసం రెడీ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్‌, మాస్ వాతావరణం, రీరిలీజ్ అయినా సరే సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, సలార్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×