BigTV English

Salaar Team Interview : సలార్ స్పెషల్ ఇంటర్వ్యూ .. రచ్చ పుట్టిస్తున్న రాజమౌళి..

Salaar Team Interview : సలార్ స్పెషల్ ఇంటర్వ్యూ .. రచ్చ పుట్టిస్తున్న రాజమౌళి..
Salaar Team Special Interview

Salaar Team Interview : ఇక రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న మాసివ్ మూవీ సలార్ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం తో దర్శక ధీరుడు రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ జరిపిన విషయం తెలిసిందే. మొదట దీనికి సంబంధించిన ప్రోమో ని మాత్రమే విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ని పూర్తిగా రిలీజ్ చేశారు. ఒక . కె.జి.ఎఫ్ చిత్రంతో అప్పటివరకు వస్తున్న ట్రెండ్ ని పూర్తిగా మార్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సలార్  ను కూడా అతను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ 22న సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ విడుదల కాబోతోంది.


ఇక ఈ మూవీలో వరదరాజు మన్నార్, దేవా పాత్రలు ఎంత ముఖ్యమైనవో ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో మనకు స్పష్టంగా అర్థమయ్యాయి. ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ వీళ్ళ మధ్య ఉన్న స్ట్రాంగ్ బాండింగ్ ,ఈ చిత్రానికి పునాదులు. ఇంటర్వ్యూలో రాజమౌళి ప్రభాస్ కు మంచి ఎలివేషన్ ఇచ్చారు. ప్రభాస్ జస్ట్ అలా నిలబడితే చాలు ఎవరైనా అతనితో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు.. అలాంటిది అతనితో సలార్ లాంటి చిత్రం చేయడం చాలా గ్రేట్ అంటూ ప్రశాంత్ నీల్ ను రాజమౌళి ప్రశంసించారు.

ఇక అంతటితో ఆగకుండా ఈ సినిమాని ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటూ ఓ కష్టమైన ప్రశ్నను కూడా వేశాడు రాజమౌళి. దీనికి సమాధానంగా ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. దేవా ,వరద రాజ మన్నార్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్.. ఫ్రెండ్ కోసం దేవా చేసిన పోరాటం.. ఫైనల్ గా ఇద్దరు విరోధులుగా ఎలా మారారు అన్న స్టోరీ మీద ఆధారపడి సలార్ చిత్రం ఉంటుందట. ఇక ఈ మూవీలో డ్రామా ఓ రేంజ్ లో ఉంటుందన్నారు ప్రశాంత్ నీల్. ప్రధాన పాత్రల మధ్య వర్కౌట్ అయిన ఈ డ్రామా ప్రేక్షకులను టచ్ చేస్తుందని.. కచ్చితంగా ఈ కాన్సెప్ట్ నచ్చడంతో వాళ్లు సినిమా చూడడానికి ఇష్టపడతారని ప్రశాంత్ సమాధానం ఇచ్చారు.


ఎప్పటినుంచో అందరూ ఎదురుచూస్తున్న ఒకే ఒక ప్రశ్నను కూడా రాజమౌళి ఈ సందర్భంగా అడిగేసారు. అందరూ అనుకుంటున్నట్టుగా కే జి ఎఫ్ ..సలార్ కు సంబంధం ఉందా.. అని రాజమౌళి అడిగిన ప్రశ్నకు.. సినిమాలను యూనివర్సిటీ లాగా క్రియేట్ చేయడం తనకు చేతకాదు అంటూ.. మరోపక్క రాఖీని ఎలా ఇష్టపడతారో సలార్లో దేవా వరదరాజులను కూడా అలాగే ఇష్టపడతారు అని అన్నాడు ప్రశాంత్. అయితే ఇంతకీ కనెక్షన్ ఉందా లేదా అన్న విషయంపై మాత్రం పూర్తి క్లారిటీ ఇవ్వలేదు.

ఈ మూవీలో శృతిహాసన్ కు సంబంధించి అసలు డ్యూయెట్టే లేదట. మామూలుగా శృతిహాసన్ మూవీలో ఉంది అంటే కచ్చితంగా ఒక మంచి మాస్ హీరో హీరోయిన్ల కి కంపల్సరీ. అలాంటిది ప్రభాస్ లాంటి హీరో .. శృతిహాసన్ లాంటి హీరోయిన్ ఉన్నా ఒక డ్యూయెట్ కూడా పెట్టలేదట. ఈ మాట విన్న రాజమౌళి నేను అప్సెట్ అయ్యాను అంటూ కామెడీ చేశారు. దీనికి సమాధానం ఇచ్చిన ప్రశాంత్.. సినిమాలో శృతిహాసన్ కూడా కథలో ఒక భాగం.. ప్రస్తుతం వరల్డ్ సినిమాలు తమ పంథా మార్చుకుంటున్నాయి.. హీరోయిన్ కథకు తగ్గట్టుగా ఉండాలి తప్ప కేవలం గ్లామర్ షో కి పరిమితం కాకూడదు. అందుకే స్టోరీకి అనవసరం అనుకున్న డ్యూయెట్ ని ఈ సినిమాలో పెట్టలేదు అని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు.

ఇక ప్రభాస్ మాట్లాడుతూ కేజిఎఫ్ మూవీ సక్సెస్ తరువాత ప్రతి ఒక్కళ్ళు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలి అనుకున్నారు .కానీ అతడు మాత్రం నాతో చేయాలి అనుకోవడం వెనక మీ హాండే ఉంది అని రాజమౌళిని పొగిడేసాడు. బాహుబలి చూసిన తరువాతే అతను ఈ డెసిషన్ కి వచ్చాడు అని ప్రభాస్ అనడంతో జక్కన్న తెగ కుష్ అయిపోయారు. కే జి ఎఫ్ నువ్వు చేసి ఉంటే బాగుండేది అని చాలామంది ఒకప్పుడు నాతో అన్నారు.. అందుకే ప్రశాంత్ స్టోరీ చెప్పినప్పుడు డేట్స్ అడ్జస్ట్ కాకపోయినా నాగ అశ్విన్ కు సర్ది చెప్పి మరి నేను సలార్ కి ఓకే చెప్పాను అన్నాడు డార్లింగ్. మొత్తానికి సలార్ మూవీ విడుదలయ్యాక ఎన్ని వండర్స్ సృష్టిస్తుందో చూడాలి.

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×