BigTV English

Salim Khan on Salman Khan Marriage: నా కొడుకుకు ఇప్పటివరకు ఎందుకు పెళ్లి కాలేదంటే..? : సల్మాన్ ఖాన్ తండ్రి

Salim Khan on Salman Khan Marriage: నా కొడుకుకు ఇప్పటివరకు ఎందుకు పెళ్లి కాలేదంటే..? : సల్మాన్ ఖాన్ తండ్రి

Salim Khan on Salman Khan Marriage: ప్రముఖ సినిమా హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు బాలీవుడ్ లోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఆయనను ఏ స్థాయిలో అభిమానిస్తారో.. అంతేస్థాయిలో సల్మాన్ పెళ్లి గురించి ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆయన పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. సల్మాన్ ఖాన్ కు 58 ఏళ్లు వచ్చినా కూడా ఇంకా పెళ్లి ఊసే ఎత్తడంలేదు.


ఈ క్రమంలో సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తన కొడుకు సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో? పెళ్లి విషయంలో అతని ఆలోచన ఎలా ఉంటుంది.. ఎలాంటి అమ్మాయిని అతను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు..? అనే విషయాలను  వివరించాడు.

నెట్టింటా వైరల్ అవుతున్న ఆ వీడియోలో సల్మాన్ తండ్రి మాట్లాడుతూ.. ‘సల్మాన్ ఖాన్ ఎవరినైనా త్వరగా ఇష్టపడుతాడు. కానీ, అతడికి మ్యారేజ్ చేసుకునే ధైర్యం లేదు. సింపుల్ గా ఉంటాడు కాబట్టి చాలామందికి నచ్చుతాడు. తన జీవితంలోకి వచ్చే స్త్రీ తన తల్లిలా కుటుంబాన్ని చూసుకోగలదా..? లేదా అని ఆలోచిస్తుంటాడు. తన తల్లిలాంటి లక్షణాలున్న అమ్మాయిని వెతుకుతుంటాడు.


Also Read: బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో సమంత.. నిజమేనా ?

సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకునే అమ్మాయి అతని తల్లి లాగే భర్త, పిల్లలకు అంకితం కావాలని కోరుకుంటాడు. వంట పని, ఇంటి పనులు చేయాలని, కుటుంబ సభ్యులకు అన్ని విషయాల్లోనూ సాయం చేయాలని అనుకుంటాడు. ఈరోజుల్లో అలాంటి అమ్మాయిలు ఉండడం సులభంకాదు.. అందుకే సల్మాన్ ఇప్పటివరకు ఎవరినీ వివాహం చేసుకోలే’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ పలు రకాలుగా సూచనలు చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×