BigTV English

Salman Khan – Rajinikanth Combo: సౌత్ సూపర్‌స్టార్‌తో నార్త్ సూపర్‌స్టార్.. సెట్ అయితే బాక్సాఫీస్ హిట్..!

Salman Khan – Rajinikanth Combo: సౌత్ సూపర్‌స్టార్‌తో నార్త్ సూపర్‌స్టార్.. సెట్ అయితే బాక్సాఫీస్ హిట్..!

Salman Khan – Rajinikanth Combo: సౌత్ సూపర్‌స్టార్‌తో నార్త్ సూపర్‌స్టార్ జత కట్టనున్నారు. ఒకవేళ ఇదే కాంబినేషన్ సెట్ అయితే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. వీరిద్దరికి భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా దేశవ్యాపంగా క్రేజీ ఉంది. ఈ ఇద్దరూ ఒకే ఫేమ్‌లో కనిపిస్తే.. అభిమానులకు పండుగే.


బాలీవుడ్‌లో గతేడాది కింగ్ ఖాన్ షారుక్‌తో డైరెక్టర్ అట్లీ ‘జవాను’ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్‌కు అట్లీ ఓ కథ వినిపించారని.. ఇది మల్టీ స్టారర్ ఫిల్మ్ కావడంతో అల్లుఅర్జున్ నో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అదే కథను సల్మాన్ ఖాన్‌కు అట్లీ చప్పారట. దీనికి సల్మాన్ కూడా ఓకే చెప్పారని.. అట్లీతో చేసేందుకు సల్మాన్ కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.

ఈ మూవీలో కీలక పాత్రలో నటించేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కూడా అట్లీ ఒప్పించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. రజినీకాంత్‌తో సినిమా చేసే అవకాశం వస్తే.. నేను చేయడానికి సిద్ధమేనని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అట్లీతో ఇద్దరు పాజిటివ్‌గా ఉండడంతో సినిమా వచ్చే అవకాశం ఉందని టాక్.


Also Read: Kalki2898AD Review: కల్కి రివ్యూ.. ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికేసినట్టే..

ఇదే విషయంపై రజనీతో అట్లీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రేట్ మల్టీ స్టారర్‌గా ఈ మూవీ నిలవనుంది. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ పనులు ముగింపు దశకు చేరకున్నాయని, వచ్చే ఏడాదిలో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాగా, ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌లో నిర్మించనున్నారు.

సల్మాన్ ఖాన్ ఫెవరేట్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలా వద్ద రజనీకాంత్ డేట్స్ ఉన్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తోనూ సాజిద్ నడియాడ్ వాలా ‘సికిందర్’ సినిమా చేస్తున్నారు. కావున ఈ సినిమా ఓకే అయితే సన్ పిక్చర్స్ కళానిధి మారన్, సాజిద్ నడియాడ్ వాలా నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్.

రజనీకాంత్ ప్రస్తుతం ‘వేట్టయాన్’తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఈ ఏడాది విడుదల కానుంది. ఇదే కాకుండా లోకేష్ కనగరాజ్‌తో రజనీ చేస్తున్న ‘కూలీ’ షూటింగ్ సైతం త్వరలోనే ప్రాంభం కానుంది. అటు సల్మాన్ ఖాన్ , ఇటు రజనీకాంత్ సినిమాలు పూర్తయిన వెంటనే అట్లీ సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంది.

Also Read: భారతీయుడు 2 ట్రైలర్ విడుదల.. మాములుగా లేదుగా.. హిట్ పక్కా!

సల్మాన్ ఖాన్ ఎక్కువగా సౌత్ పై దృష్టిసారిస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. అలాగే తన సినిమాల్లో సౌత్ హీరోలు కూడా అతిథి పాత్రల్లో నటించేందుకు ఇష్టపడుతున్నారు. అదే విధంగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఆసక్తికరంగా మాట్లాడారు. సౌత్, నార్త్ కలిసి సినిమాలు చేస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంటుందో ఊహించుకోంది అంటూ సల్మాన్ చెప్పుకొచ్చారు. మరి సల్మాన్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×