SC on Group 1 notification: మీరెవరూ ప్రిలిమ్స్ పరీక్షలు పాస్ కానందున మెయిన్స్ వాయిదా వేయాల్సిన అవసరం ఏముంది? పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరమని, దీనివల్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియ తీవ్ర జాప్య మవుతుందని సుప్రీం కోర్టు తాజాగా తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు పిటీషన్ పై తీర్పునిస్తూ కీలక కామెంట్స్ చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది.
2022 లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్దమంటూ, గతంలో తెలంగాణ హైకోర్టులో పిటీషన్ ను కొంత మంది అభ్యర్ధులు దాఖలు చేశారు. అలాగే 2024 గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా 14 తప్పులున్నాయని, మెయిన్స్ ను వాయిదా వేయాలని అభ్యర్ధులు కోర్టు మెట్లెక్కారు. దీనితో హైకోర్టులో ప్రిలిమ్స్ రాసిన అభ్యర్ధులకు చుక్కెదురైంది.
అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేశారు ప్రిల్సిమ్స్ రాసిన అభ్యర్ధులు. దీనితో జస్టిస్ పి ఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ సాగింది. కోర్టును ఆశ్రయించిన అభ్యర్ధులు ఎవరూ ప్రిలిమ్స్ పరీక్షలు పాస్ కానందున మెయిన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదని ఈ సంధర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరమని, దీనివల్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియ తీవ్ర జాప్య మవుతుందని కూడా ధర్మాసనం తెలిపింది. అభ్యర్ధుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించినట్లయింది.
తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ – 1 నోటిఫికేషన్ విడుదల సమయం నుండి పలు వివాదాలు చుట్టుముట్టాయి. పరీక్షలను వాయిదా వేయాలని పలువురు నిరసనల పర్వం సాగించారు. అయితే ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమంటూ.. తన పని తాను చేసుకుపోయింది. పరీక్షలను కూడా ఎంతో పకడ్బందీగా నిర్వహించింది సీఎం రేవంత్ సర్కార్. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా. ఏర్పాట్లు చేయడంపై వారు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కానీ కొందరు అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించగా, చివరకు వారికి చుక్కెదురైంది. ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ దక్కింది.