HBD Salman khan:బాలీవుడ్ కండల వీరుడుగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్(Salman Khan)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందర్భం ఏదైనా సరే చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. ముఖ్యంగా ఆయన ధరించే వాచ్ మొదలుకొని షూస్ వరకు ప్రతీది కూడా లగ్జరీ గానే ఉంటుంది. అంతేకాదు ఆయన ఉపయోగించే వస్తువులు కూడా అంతే ఖరీదు చేస్తూ ఉంటాయి. అందుకే బాలీవుడ్లో అత్యంత ధనవంతుడిగా పేరు సొంతం చేసుకున్నారు సల్మాన్ ఖాన్. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఆస్తుల చిట్టా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి సల్మాన్ ఖాన్ ఆస్తులు విలువ ఎంతో ఇప్పుడే చూద్దాం.
సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ.
సల్మాన్ ఖాన్ ప్రస్తుత వయసు 59 సంవత్సరాలు. ‘బీవీ హో తో ఏసీ’ అనే చిత్రం ద్వారా చిన్న పాత్రతో నటుడిగా పరిచయమయ్యారు. అయితే ‘మేనే ప్యార్ కియా’ సినిమా ఆయనకు మంచి విజయాన్ని అందించింది. అటు బుల్లితెర పై కూడా నటించాడు. ఇప్పుడు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చలామణి అవుతున్న ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా హిందీ బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ.. భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇకపోతే సల్మాన్ ఖాన్ నికర ఆస్తుల విలువ 3000 కోట్ల రూపాయలు అని సమాచారం. సల్మాన్ ఖాన్ హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఆస్తులు పోగేసుకోవడమే కాదు పంచడంలో కూడా ముందే..
ముఖ్యంగా సల్మాన్ ఖాన్ “బీయింగ్ హ్యూమన్” అనే బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇది ఆయన సొంత బ్రాండ్ కావడం గమనార్హం. 2013లోనే ఈ బ్రాండ్ ను స్థాపించారు. దీని ద్వారా చారిటబుల్ ట్రస్ట్ కి సహాయం అందిస్తున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ ఎప్పుడూ కూడా ఫిట్నెస్ పైన ఎక్కువగా దృష్టి పెడతారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆయనకు దేశవ్యాప్తంగా 300కు పైగా ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయి. దీనికి తోడు అనేక బ్రాండ్లను కూడా ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. వీటి ద్వారా పెద్ద మొత్తంలో సంపాదిస్తూ ఉండడం గమనార్హం.
బుల్లెట్ ప్రూఫ్ కార్ కూడా ఈయన సొంతం..
ఇవే కాకుండా సల్మాన్ ఖాన్ కి “సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్” అనే నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఈ నిర్మాణ సంస్థ ద్వారా ‘బజరంగీ భాయిజాన్’, ‘రేస్ 3’, ‘ట్యూబ్ లైట్’, ‘భారత్’ వంటి చిత్రాలను కూడా నిర్మించారు. ఇక ముంబైలోని బాంద్రాలో సల్మాన్ ఖాన్ కి గ్యాలక్సీ అపార్ట్మెంట్ కూడా ఉంది. దీని విలువ సుమారుగా రూ.150 కోట్లు. అలాగే 150 ఎకరాలలో ఫామ్ హౌస్ కూడా ఉంది. పన్వేల్ లో ఉన్న ‘అర్పిత ఫామ్స్’ పేరుతో ఈ ఫామ్ హౌస్ ఉండడం గమనార్హం. ముంబైలోని గోరాయ్ లో రూ.100 కోట్ల విలువైన బీచ్ సైడ్ ఇల్లు కూడా ఈయన సొంతం. అలాగే ముంబైలోని ఒక లింకింగ్ రోడ్డులో రూ. 120 కోట్ల విలువైన ప్రాపర్టీ ఉంది. అంతేకాదు బిష్ణోయ్ వర్గం నుండి తనను తాను కాపాడుకోవడం కోసం రూ.2కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కార్ ని కూడా కొనుగోలు చేశారు. ఇక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాలలో కూడా ఇస్తున్నారు సల్మాన్ ఖాన్.