BigTV English

Salman Khan : బిష్ణోయ్ ఎఫెక్ట్… షూటింగ్ సెట్స్‌లోనూ రాజకీయ నాయకుడికి మించిన భద్రత..

Salman Khan : బిష్ణోయ్ ఎఫెక్ట్… షూటింగ్ సెట్స్‌లోనూ రాజకీయ నాయకుడికి మించిన భద్రత..

Salman Khan : గత కొన్ని రోజుల నుంచి సల్మాన్ ఖాన్ (Salman Khan) కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ చేస్తున్నా, లేదంటే బయట ఎక్కడికి వెళ్లినా సల్మాన్ కు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సికిందర్’ (Sikandar) మూవీ షూటింగ్ కు ఏకంగా నాలుగు అంచల భద్రతను కల్పించడం విశేషం. మరి ఈ మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? సల్మాన్ ఖాన్ కు కాపలాగా ఎంతమంది పోలీసులు ఉన్నారు? అనే వివరాల్లోకి వెళ్తే…


కొన్నాళ్ల క్రితమే సల్మాన్ ఖాన్ (Salman Khan) సన్నిహితుడు బాబా సిద్ధికి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ కు కూడా వరుసగా హత్య బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఈ బెదిరింపుల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి బెదిరింపులు వస్తున్నప్పటికీ సల్మాన్ ఖాన్ ఇంట్లో కూర్చోకుండా సినిమా, బిగ్ బాస్ షూటింగ్ అంటూ బిజీ బిజీగా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు.

సమాచారం ప్రకారం మొత్తం దాదాపు 70 మందికి పైగా సల్మాన్ ఖాన్ (Salman Khan) కు కాపలా కాస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ‘సికిందర్’ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుండగా, అక్కడ సల్మాన్ కు ఎన్ఎస్జి కమాండోలు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, పోలీసులు అందరూ కలిపి 70 మంది సల్మాన్ కు స్పెషల్ గా భద్రత కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు మొత్తం 4 అంచల రక్షణను ఏర్పాటు చేశారని సమాచారం.


కాగా సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న ‘సికిందర్’ (Sikandar) సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ సౌత్ డైరెక్టర్ మురగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరుగుతోంది. ఇందుకోసం హైదరాబాదులో రెండు సెట్లు ఏర్పాటు చేశారని, మిగిలిన షూటింగ్ మొత్తాన్ని ఈ ప్రైవేట్ హోటల్లో పూర్తి చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్రదేశాలన్నింటికీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయగా, సదరు ప్రైవేట్ హోటల్ లోని ఒక భాగంలో మాత్రమే షూటింగ్ చేసేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

అయినప్పటికీ హోటల్ కు వచ్చే సందర్శకులు అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ లోపల పంపిస్తున్నారు. హోటల్ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేసిన తర్వాత రెండో దశలో భాగంగా సల్మాన్ ఖాన్ ప్రైవేట్ సెక్యూరిటీ టీం కూడా చెక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే షూటింగ్ టైంలో ఏదైనా ప్రమాదం జరిగితే అది ‘సికిందర్’ (Sikandar) టీం మొత్తానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. అందుకే చిత్ర బృందం సైతం జాగ్రత్తలు తీసుకుంటుండగా, రాజకీయ నాయకులకు కూడా లేనంతగా  ఎన్ఎస్జి కమాండోలు, పోలీస్ అధికారులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సల్మాన్ కు రక్షణగా నిలవడం అన్నది హాట్ టాపిక్ గా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×