Tiger 3 Review : దీపావళికి సల్మాన్ యాక్షన్.. మూవీ ఎలా ఉందో తెలుసా?

Tiger 3 Review : దీపావళికి సల్మాన్ యాక్షన్.. మూవీ ఎలా ఉందో తెలుసా?

Tiger 3 Review
Share this post with your friends

Tiger 3 Review

Tiger 3 Review : దీపావళి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ మూవీ టైగర్ 3. గత కొన్ని సంవత్సరాలుగా మంచి హిట్ లేక సతమతమవుతున్న సల్మాన్ ఈ చిత్రంతో భారీ హిట్ సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఇంప్రెస్ చేసిందో చూద్దాం..

కథ :

స్టోరీ విషయానికి వస్తే ఇందులో సల్మాన్ ఖాన్ ఒక ‘రా’ఏజెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే.ఇక అతని భార్య కూడా ఒక మాజీ ఐఎస్ఐ ఏజెంట్ జోయా.గోపి (రణ్వీర్ షోరే) ను తీవ్రవాదుల నుంచి కాపాడే సమయంలో ఒక టైం పాస్ మిషన్ మొదలు పెడతారు. అయితే చనిపోతూ గోపి జోయా ఒక డబల్ ఏజెంట్ అని చెబుతాడు. తర్వాత కొన్ని నాటకీయ సన్నివేశాల కారణంగా టైగర్, జోయ కలిసి టర్కీలో పాకిస్తాన్ కు సంబంధించిన ఒక సూట్ కేసును దొంగలించాల్సి వస్తుంది. ఇంతకీ ఆ సూట్ కేస్ లో ఏముంది? ఇద్దరి కోసం ఇరుదేశాల ప్రభుత్వాలు ఎందుకు వేట మొదలుపెడతాయి?ఐఎస్ఐ ఏజెంట్ అతిష్ రెహమాన్ (ఇమ్రాన్ హష్మీ) కు టైగర్ కు మధ్య లింక్ ఏంటి? తెలియాలి అంటే స్క్రీన్ పై సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 

ఈ మూవీ ఒక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అనడంలో ఎటువంటి డౌట్ లేదు. కొన్నిచోట్ల భారీ విజువల్స్ ,గ్రాండ్ యాక్షన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. టైగర్ సిరీస్ మిగిలిన రెండు మూవీస్ లాగానే ఇది కూడా హిట్ అయ్యే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ చిత్రం మొత్తానికి సల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ షో చేశాడా అనిపిస్తుంది. అంత అద్భుతంగా సల్మాన్ తన పాత్రలో లీనం అయిపోయాడు మరి. మరీ ముఖ్యంగా యాక్షన్స్ అన్ని దేశాలలో సల్మాన్ బాయ్ బాడీ లాంగ్వేజ్ సూపర్ గా సెట్ అయింది.

కత్రినా ఎప్పటిలాగే ఈ సినిమాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా వైట్ టవల్ ఫైట్ సీక్వెన్స్ లో కత్రినా కుర్ర కారు మనసు దోచుకుంది.ఇక మధ్యలో స్పెషల్ ఎంట్రెన్స్ ఇచ్చే షారుక్ మూవీకి హైలైట్ గా నిలిచారు.ఇమ్రాన్ హష్మీ పెద్దగా నటించేసుకోపులేని పాత్ర చేసినప్పటికీ ఉన్నంతలో అద్భుతంగా అలరించాడు.

ప్లస్ పాయింట్స్ :

సల్మాన్ ఖాన్ యాక్షన్ మూవీకి మంచి ప్లస్ పాయింట్.

కత్రినా టవల్ ఫైట్ మెస్మరైజింగ్ గా ఉంది.

షారుక్ ఖాన్ గెస్ట్ ఆపియరెన్స్ మూవీకి మంచి హైప్ ఇచ్చింది.

యాక్షన్స్ అన్ని వేశాలు దంచి కొట్టా రేంజ్ లో ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

 స్టోరీ బాగా రొటీన్ గా ఉంది.

మూవీలో కాస్త డెత్ ఇంటెన్సిటీ పెంచితే బాగుండేది.

కొన్ని సీన్స్ లో కంటెంట్ క్లియర్ గా లేకపోవడంతో కన్ఫ్యూషన్ వస్తుంది.

సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కాస్త కృత్రిమంగా ఉన్నాయి.

ఇమ్రాన్ హష్మీ మోటివ్ గురించి ఇంకా కాస్త వివరంగా రాసి ఉంటే బాగుండేది.

మూవీ: టైగర్ 3

డైరెక్టర్:మనీష్ శర్మ

ప్రొడ్యూసర్:ఆదిత్య చోప్రా

నటీ నటులు:సల్మాన్ ఖాన్,కత్రినా కైఫ్,ఇమ్రాన్ హష్మీ

రిలీజ్ డేట్: 12/11/23

రేటింగ్:

2.75 /5

చివరి మాట:

మీకు మంచి హైవోల్టేజ్ యాక్షన్ పై డ్రామా ఇంట్రెస్ట్ ఉంటే టైగర్ 3 మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. మంచి దీపావళి ధమాకాగా ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

YSRCP: ఆర్కే మంగళం!.. జగన్‌తో ఎంతెంత దూరం!?

Bigtv Digital

Telangana: డీహెచ్ VRS?.. గులాబీ గూడెంకు గడల! మరి, వనమా?

Bigtv Digital

Chandrababu : ఏపీలో 2022 విధ్వంస నామ సంవత్సరం.. జగన్ పై బాబు ఫైర్..

Bigtv Digital

TSLPRB : తెలంగాణలో ఎస్ఐ , కానిస్టేబుల్‌ ఫైనల్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే…

Bigtv Digital

SIT report: కోదండరాం, రాజనర్సింహాలకు వల.. బీజేపీ బిగ్ స్కెచ్!

BigTv Desk

Bhola Shankar: మెగాస్టార్ ‘భోళా శంకర్’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Bigtv Digital

Leave a Comment