
PM Modi Diwali : దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్‌లోని లేప్చా సైనిక శిబిరాన్ని సందర్శించారు. ప్రతిఏటా మాదిరిగానే.. ఈసారీ కూడా సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు మోడీ.
జవాన్లతో ముచ్చటించి.. స్వీట్లు తినిపించారు. జవాన్లతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఫొటోలను తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు మోడీ. ధైర్యవంతమైన మన భద్రతా బలగాలతో కలిసి పండగ చేసుకుంటున్నట్లు తెలిపారు మోడీ.
నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపావళి పండుగను సైనికులతో జరుపుకుంటున్నారు. 2014లో దీపావళి సందర్భంగా సియాచిన్ గ్లేసియర్‌లో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. 2015లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సైనికులతో కలిసి దివాళి వేడుకలు జరుపుకున్నారు మోడీ.
మరో వైపు జమ్ముకశ్మీర్‌లో సరిహద్దు వద్ద భారత సైనికులు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
.
.
.