Akkineni Naga Chaitanya:అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన, ‘ఏ మాయ చేసావే’ సినిమాలో హీరోయిన్ గా తనతో కలిసి నటించిన సమంత (Samantha )ను ప్రేమించి, దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన నాలుగేళ్ల వరకు ఎంతో అన్యోన్యంగా, ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకొని, అందరిని ఆశ్చర్యపరిచారు. అప్పటివరకు క్యూట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న వెంటనే సమంత పై చాలామంది చాలా దారుణంగా ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సమంత టార్చర్ భరించలేక నాగచైతన్య దూరం అయ్యాడని, సమంత ఇంకొకరితో ఎఫైర్ నడపడం వల్లే నాగచైతన్య దూరం అయ్యాడు అంటూ ఇలా పలు రకాల విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయినా సరే అవార్డు అన్నింటిని దిగమింగుకొని మరీ ఒంటరి పోరాటం చేస్తోంది సమంత.
నాగచైతన్య వల్ల సమంత పై విమర్శలు..
అయితే ఇదే సమయంలో నాగచైతన్య ను మాత్రం ఏ ఒక్కరు ఒక్క మాట కూడా అనలేదు. పైగా నాగచైతన్య సమంత నుండి విడిపోయిన రెండు ఏళ్లకే శోభిత ధూళిపాళతో ప్రేమాయణం మొదలుపెట్టారు. ఆ సమయంలో కూడా నాగచైతన్య పై ఎవరు కూడా ఎలాంటి మాటలు మాట్లాడలేదు. మరొకవైపు ఏకంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు కూడా.. ఆ సమయం లో కూడా నాగచైతన్య ఒంటరి జీవితాన్ని భరించలేక శోభితాను వివాహం చేసుకున్నాడని, ఇక శోభిత తన జీవితంలోకి వచ్చిన తర్వాత నాగచైతన్యకు అంతా మంచే జరుగుతోందని కామెంట్లు చేశారు. వివాహం చేసుకున్న తర్వాత నాగచైతన్య నటించిన తండేల్ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. దీనికి తోడు వెకేషన్స్, హోటల్స్ కి కూడా చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారు. పైగా తన డ్రీమ్ హోటల్ ని కూడా ప్రారంభించారు నాగచైతన్య.
నాగచైతన్య వల్లే ఇటు శోభితపై విమర్శలు..
అయితే ఇదే సమయంలో నాగచైతన్య కెరీర్ కు సక్సెస్ గా మారిన శోభితపై నాగచైతన్య అభిమానులు ప్రశంశిస్తుంటే సమంత అభిమానులు మాత్రం విమర్శిస్తున్నారు.. ముఖ్యంగా శోభిత పాత వీడియోలను ఆమె చేసిన యాడ్స్ ను బయటకు తీసి మరీ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.అటు సమంత అభిమానులు శోభితపై.. ఇటు నాగచైతన్య అభిమానులు సమంత పై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరిని చూస్తూ ఉంటే నాగచైతన్యాన్ని వివాహం చేసుకోవడమే వీరు చేసిన పాపమా అన్నట్లు నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. అటు సమంతాను ఇటు శోభితాను ఇద్దరినీ కూడా ఒక్క నాగచైతన్య విషయంలోనే విమర్శలు గుప్పించడం నిజంగా వీరిద్దరిని చూస్తే.. బాధగా ఉందని మరొక వర్గం నెటిజన్స్ కూడా కామెంట్ చేసేస్తున్నారు. ఏది ఏమైనా వీరికి నాగచైతన్య వల్ల ఒకప్పుడు సమంతకి గుర్తింపు వచ్చినా.. ఇప్పుడు శోభితకి గుర్తింపు వచ్చినా సరే ఆ గుర్తింపుతో పాటు విమర్శలు కూడా ఎదుర్కోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. మరి అభిమానులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇద్దరిని వదిలేస్తే బెటర్ ఏమో అని కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం