BigTV English

Simran: కోలీవుడ్‌లో కోల్డ్ వార్.. సిమ్రాన్, జ్యోతిక మధ్య ముదురుతున్న వివాదం..

Simran: కోలీవుడ్‌లో కోల్డ్ వార్.. సిమ్రాన్, జ్యోతిక మధ్య ముదురుతున్న వివాదం..

Simran: మామూలుగా సినీ పరిశ్రమలో హీరోలకు, హీరోయిన్లకు మధ్య గొడవలు కామన్. కొందరు ఆ గొడవలను ప్రేక్షకులకు తెలిసిన పర్వాలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తే కొందరు మాత్రం కోల్డ్ వార్‌తోనే ఆపేస్తారు. అలా ప్రతీ ఇండస్ట్రీలో కొందరి మధ్య కోల్డ్ వార్ అనేది కామన్. తాజాగా కోలీవుడ్‌లో కూడా ఒక కోల్డ్ వార్ మొదలయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు సీనియర్ హీరోయిన్లు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే రేంజ్‌కు వచ్చారని తెలుస్తోంది. అందులో ఒకరు సిమ్రాన్ కాగా మరొకరు జ్యోతిక. ఇటీవల సిమ్రాన్ స్టేజ్‌పై చేసిన కామెంట్స్ వల్లే ఈ రచ్చ మొదలయ్యింది. దానిపై తను క్లారిటీ ఇస్తూ మరోసారి ప్రేక్షకుల్లో సందేహాలు మొదలయ్యేలా చేసింది.


ఓపెన్ కామెంట్స్

సిమ్రాన్, జ్యోతిక.. వీరిద్దరూ దాదాపుగా ఒకే సమయంలో హీరోయిన్లుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. దాదాపుగా ఇద్దరికీ ఒకేసారి స్టార్‌డమ్ వచ్చింది. ఇప్పుడు కూడా మళ్లీ కెరీర్‌లో తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇద్దరూ కొన్నాళ్లు వెండితెరకు దూరంగా ఉన్నా కూడా ఇప్పుడు తమ వయసుకు తగిన పాత్రలు చేస్తూ యాక్టింగ్ విషయంలో మళ్లీ ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. అలాంటి వీరిద్దరి మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తోంది కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల ‘అంధగాన్’ అనే సినిమాలో సిమ్రాన్ పర్ఫార్మెన్స్‌కు అవార్డ్ లభించింది. ఆ అవార్డ్ ఫంక్షన్‌లో తను చేసిన వ్యాఖ్యల వల్లే ఇదంతా మొదలయ్యింది.


ఆమెను ఉద్దేశించే.?

స్టేజ్‌పై అవార్డ్ అందుకున్న తర్వాత ‘‘ఆంటీ పాత్రలు చేయడం కంటే ఇదే బెటర్’’ అంటూ ఒక హీరోయిన్ తనకు మెసేజ్ చేసిందని చెప్పుకొచ్చింది సిమ్రాన్ (Simran). అయితే ‘‘ఆంటీ పాత్రలు చేయడం తప్పేమీ కాదు. డబ్బా పాత్రలకంటే అదే బెటర్’’ అంటూ స్టేజ్‌పై తనకు సమాధానమిచ్చింది ఈ సీనియర్ హీరోయిన్. కానీ తనకు అలా మెసేజ్ చేసిన హీరోయిన్ ఎవరు అని పేరు మాత్రం రివీల్ చేయలేదు. డబ్బా పాత్రలు అనగానే అందరూ జ్యోతికనే అలా మెసేజ్ చేసి ఉండవచ్చని ఊహించడం మొదలుపెట్టారు. ఎందుకంటే కొన్నిరోజుల క్రితమే జ్యోతిక నటించిన ‘డబ్బా కార్టెల్’ అనే వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. ఇక తాజాగా మరోసారి తన స్టేట్‌మెంట్ గురించి క్లారిటీ ఇచ్చేసింది సిమ్రాన్.

Also Read: ఆ క్రెడిట్ అంతా పూజా హెగ్డేకే ఇస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన హీరో

నేను ప్రస్తావించలేదు

‘‘నేను ఏ హీరోయిన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్స్ మంచి ఫ్రెండ్స్‌గా ఉంటే చూడలేరు. నేను నా స్పీచ్‌లో ఎవరి గురించి అయితే చెప్పానో తను మళ్లీ నన్ను కాంటాక్ట్ చేసింది. దీనివల్ల మా ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగింది. ఇప్పటినుండి మా ఫ్రెండ్‌షిప్ మునుపటి లాగా ఉండదు’’ అని చెప్పుకొచ్చింది సిమ్రాన్. కానీ తను చెప్పింది జ్యోతిక గురించి కాదు అని మాత్రం అనలేదు. దీంతో కచ్చితంగా అది జ్యోతికనే అయ్యిండవచ్చని ప్రేక్షకులు కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు. ఇప్పటికీ సిమ్రాన్, జ్యోతిక పోటాపోటీగా వరుస అవకాశాలతో దూసుకుపోతుండగా ఇద్దరి కెరీర్ మంచి స్పీడ్‌లో ఉంది. జ్యోతిక (Jyothika) సినిమాలతో పాటు సిరీస్‌లపై కూడా ఫోకస్ పెట్టింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×