Kantara 1: ఏదైనా సినిమా విడుదలయ్యి అది హిట్ అయితే.. దానికి సీక్వెల్ తెరకెక్కడం కామన్. కానీ ఏ భాషలో అయినా ప్రీక్వెల్స్ అనేవి కూడా వచ్చాయి. అసలైతే ఈ సినిమాకు ముందు జరిగిన కథ ఏంటి అని చెప్పడమే ప్రీక్వెల్. ప్రస్తుతం ఇండియన్ భాషల్లో ఎక్కడా ప్రీక్వెల్ ట్రెండ్ మొదలవ్వలేదు. అందుకే ఒక కన్నడ హీరో మాత్రం ఈ ట్రెండ్‌ను క్రియేట్ చేయాలని మొదలుపెట్టాడు. తను మరెవరో కాదు.. రిషబ్ శెట్టి. ఎన్నో ఏళ్లుగా శాండిల్‌వుడ్‌లో దర్శకుడిగా, నిర్మాతగా క్వాలిటీ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన రిషబ్.. ప్రస్తుతం ‘కాంతార 1’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ ప్రీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ బయటికొచ్చింది.
గ్రాండ్ లెవెల్‌లో నిర్మాణం
కర్ణాకటలోని మారుమూల ప్రాంతాల్లో చేసే ఒక పండగ ఆధారంగా, వారు మొక్కే దేవుడి ఆధారంగా ఒక సినిమా తెరకెక్కింది. అదే ‘కాంతార’. ఆ సినిమా అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కింది. పైగా ముందుగా కేవలం కన్నడలో మాత్రమే విడుదలయ్యింది. అక్కడ మౌత్ టాక్‌తో ‘కాంతార’ బ్లాక్‌బస్టర్ సాధించింది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేశారు మేకర్స్. అలా ఈ మూవీకి విపరీతమైన పాపులారిటీ లభించింది. ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు ఇందులో హీరోగా నటించిన రిషబ్ శెట్టి (Rishab Shetty) కూడా అన్ని భాషా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అందుకే ఈ మూవీ ప్రీక్వెల్‌ను మరింత గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశాడు రిషబ్.
దానికోసమే కష్టాలు
‘కాంతార’ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో దీని ప్రీక్వెల్‌ను మరింత భారీ లెవెల్‌లో నిర్మించాలని హేంబేల్ ఫిల్మ్స్ నిర్ణయించుకుంది. పైగా ఇందులో కొన్ని యుద్ధ సన్నివేశాలు కూడా ఉండనున్నాయనే విషయం తాజాగా బయటపడింది. ఆ సీన్స్ ఏ విషయంలోనూ తక్కువ కాకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రత్యేక శ్రద్ధతో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ‘కాంతార 1’లో ఈ సీనే హైలెట్ కానుందని కూడా తెలుస్తోంది. అందుకే ఈ సీన్ కోసం ఏకంగా 50 రోజులు కేటాయించాడట రిషబ్ శెట్టి. పూర్తిగా 50 రోజుల పాటు ఇదే సీన్‌ను షూట్ చేసి ప్రేక్షకులకు ఒక పర్ఫెక్ట్ వార్ సీన్ అందించాలని ప్లాన్ చేశాడట ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్.
Also Read: సమంత ‘రక్త్ బ్రహ్మాండ్’ సీరిస్ ఆగిపోయిందా? రాజ్-డీకే ఊహించని రిప్లై!
సౌకర్యాలు లేకపోయినా
కర్ణాటకలోని కొండ ప్రాంతాల్లో ‘కాంతార 1’ (Kantara 1) వార్ సీన్ షూటింగ్ జరగనుంది. ఈ షూటింగ్ చేయడం కోసం దాదాపు నెల రోజుల పాటు అదే అడవి ప్రాంతంలో ఉండనుందట మూవీ టీమ్. అక్కడ సౌకర్యాలు ఎక్కువగా లేకపోయినా కూడా ఈ వార్ సీన్‌ను షూట్ చేయడం కోసం ఎంత కష్టం అయినా పడడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందమైన కొండల మధ్య ఈ భయంకరమైన సీన్ షూటింగ్ జరగనుంది. ఇప్పటికే ‘కాంతార 1’పై కన్నడ ప్రేక్షకుల్లో మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను అందుకోగలిగితే శాండిల్‌వుడ్ నుండి వచ్చి దేశవ్యాప్తంగా హిట్ సాధించిన సినిమాల్లో ‘కాంతార 1’ పేరు నిలిచిపోతుంది.