Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సమంత (Samantha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరంలేదు. తన నటనతో, అందంతో, యాక్షన్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పించిన ఈమె గత కొద్ది రోజులుగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తో ప్రేమలో ఉందని, అతడితో పెళ్లికి సిద్ధమవుతోంది అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరూ ఎక్కడ కలిసిన సరే జంట గా కనిపిస్తూ.. అభిమానులలో సరికొత్త అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు. దీనికి తోడు గత కొన్ని రోజుల క్రితం తిరుపతి, శ్రీకాళహస్తి లో కూడా జంటగా కనిపించి ఆశ్చర్యపరిచారు. అయితే ఇలా వార్తలు జోరుగా వైరల్ అవుతున్నా.. ఈ బంధం పై అటు రాజ్ నిడిమోరు, ఇటు సమంత ఇద్దరూ కూడా స్పందించకపోవడం గమనార్హం.
అతడితో బంధానికి పేరు పెట్టలేను – సమంత
అయితే ఈ బంధం పై సమంత నోరు విప్పలేదు. కానీ రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran)తో తన బంధం గురించి నోరు విప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా తమ బంధం పేరు పెట్టలేనిది అంటూ చెప్పి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల కోలీవుడ్లో నిర్వహించిన గోల్డెన్ క్వీన్ పురస్కారాలలో సమంత గోల్డెన్ క్వీన్ గా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తో తన బంధం గురించి తెలిపింది. సమంత మాట్లాడుతూ.. “నాకు మయోసైటిస్ వ్యాధి వచ్చి ఆరోగ్యం బాగా లేనప్పుడు రాహుల్ నా వెంటే ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటూ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. మా అనుబంధానికి పేరు పెట్టలేను.. సోదరుడా.. కుటుంబ సభ్యుడా.. రక్తసంబంధీకుడా.. స్నేహితుడా.. ఇలా ఏ బంధంతో కూడా నేను రాహుల్ ను పోల్చలేను” అంటూ రాహుల్ రవీంద్రన్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చింది.
ఒక నిర్ణయం భవిష్యత్తును మార్చలేదు – సమంత
ఇక అలాగే అభిమానుల గురించి కూడా మాట్లాడుతూ.. ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం నిజంగానే అదృష్టం.. అదృష్టం తో పాటు నేను పడిన కష్టమే ఈరోజు ఇంతమంది అభిమానులను పొందడానికి కారణం అయింది. ఇది దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. మనం తీసుకునే ఒక నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేము కదా.. ఒకవేళ ఎవరైనా అలా డిసైడ్ చేస్తే అది నిజంగా అబద్దమే అవుతుంది. తెలిసీ, తెలియక తీసుకున్న నిర్ణయాలు కెరియర్ పై ప్రభావం చూపుతాయి.” అంటూ సమంత తెలిపింది. ఇక సమంత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక సమంత విషయానికి వస్తే ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్’ అని వెబ్ సిరీస్ లో నటిస్తోంది. మరొకవైపు ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ స్థాపించి.. దీని ద్వారా మే 9వ తేదీన ‘శుభం’ అనే సినిమాను విడుదల చేస్తున్నారు.