Pakistan on Terror Attack : ఉగ్రదాడిలో 26 మంది హిందువులు దుర్మరణం చెందారు. ఆ మారణహోమాన్ని మనుషులు ఎవ్వరూ సమర్థించట్లేదు. పాపిస్తాన్ మాత్రం ఆ ముష్కరులను వెనకేసుకొచ్చింది. ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పెహల్గామ్‌లో దాడి చేసిన వాళ్లు ఫ్రీడమ్ ఫైటర్స్ కావొచ్చంటూ ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ కామెంట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. మతి ఉండే మాట్లాడుతున్నారా? అంటూ ఆయనపై భారతీయులు మండిపడుతున్నారు. ఉప ప్రధాని వ్యాఖ్యలతో టెర్రరిజంపై పాకిస్తాన్ అసలు స్వరూపం బయటపడిందంటూ ఫైర్ అవుతున్నారు.
వార్ ఆఫ్ యాక్ట్
సింధూ జలాల ఒప్పందం నుంచి భారత్ వైదొలగడం.. ‘యుద్ధ చర్య’ అంటూ ఇషాక్ దార్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌లో 24 కోట్ల మందికి అవసరమయ్యే ఆ నీటిని భారత్ ఆపలేదన్నారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని జాతీయ భద్రతా కమిటీ (NSC) సమావేశం తర్వాత ఆయన ఈ ప్రకటన చేయడం ఆసక్తికరం.
భారత్‌కు హాని కలిగిస్తాం..
మరోవైపు, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్.. భారత్‌పై బెదిరింపులకు దిగారు. పాకిస్తానీలకు హాని కలిగిస్తే.. భారతదేశానికి కూడా హాని చేస్తామని హెచ్చరించారు. అంటే, కయ్యానికి కాలు దువ్వుతున్నట్టే ఉంది పాకిస్తాన్ తీరు. ఇప్పటికే సరిహద్దులకు ఆర్టీ బలగాలను, యుద్ధ విమానాలు తరలిస్తోంది దాయాది దేశం. తమ సైనికులకు సెలవులు కూడా రద్దు చేసింది. బోర్డర్‌లో కాల్పులకు తెగబడుతూ.. ఇండియాను కవ్విస్తోంది కూడా. యాక్ట్ ఆఫ్ వార్ అంటూ పదే పదే యుద్ధ ప్రస్తావన తీసుకొస్తోంది పాకిస్తాన్.
చాలా చెత్త పనులు చేశాం..
అయితే, ఇదే సమయంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు. “30 దశాబ్ధాల పాటు చాలా చెత్త పనులు చేశాం.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం.. ఇప్పుడదే మా కొంప ముంచింది.. పాక్ చాలా ఇబ్బందులు పడుతోంది..” అని అన్నారు. ఇప్పటి వరకరూ తమ దేశంలో ఉగ్రవాదులే లేరని బీరాలు పలికిన పాక్.. ఇప్పుడు తామే ఉగ్రవాదులను పెంచి పోషించామని ఒప్పుకున్నట్టైంది. ఓ ఇంటర్నేషనల్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే తాము ఈ చెత్తపనులు చేశామన్నారాయన.
ఆ దేశాల కోసమే..
పశ్చిమ దేశాల కోసం చేసిన తప్పులు తమకు ఇప్పుడు శాపంగా మారాయని అన్నారు ఖవాజా. ఆ పొరపాట్లు చేయకుండా ఉండి ఉంటే.. పాక్ ట్రాక్ రికార్డు ఇప్పుడు వేరేలా ఉండేదని చెప్పారు. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తాము కూడా భాగస్వాములం అయ్యి చారిత్రక తప్పిదం చేశామన్నారు.
పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు కీలక మంత్రులు పహల్గాం దాడుల తర్వాత చేసిన ఇలాంటి వ్యాఖ్యలు చూస్తుంటే.. ఉగ్రవాదం కేరాఫ్ పాకిస్తాన్ అని తెలిసిపోతోంది.
Also Read : మీ ఇంటికొచ్చి మరీ లేపేస్తాం.. ఆనాటి సర్జికల్ స్ట్రైక్ పై కంప్లీట్ డీటైల్స్..
Also Read : ఇండియా vs పాకిస్తాన్.. ఎవరి బలం ఎంత?
Also Read : ఉగ్రవాదంపై కశ్మీర్ ముస్లిం యువకుడి ఎమోషనల్ వీడియో..