Indian Railways: రాజమండ్రి గోదారి బ్రిడ్జిపై రైలు ప్రయాణం. ఈ మాట వినగానే ఎక్కడలేని ఉత్సాహం కలుగుతుంది. రైలు బ్రిడ్జి మీది నుంచి వెళ్తుండగా వచ్చే శబ్ధం, గోదారి నదిపై నుంచి వీచే చల్లని గాలి మైమరిపిస్తాయి. రైల్లో వెళ్తున్న ప్రయాణీకులలో కొందరు గోదావరి తల్లికి నమస్కరిస్తే.. మరి కొందరు ఫోటోలు తీస్తారు.. ఇంకొందరు నదిలో నాణేలు వేస్తారు. బ్రిడ్జి మీద ఉన్నంత సేపు జనాలు లోకాన్ని మర్చిపోతారు. బ్రిడ్జి దాటిన తర్వాత మరోసారి వెళ్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది.
వైరల్ అవుతున్న తాజా వీడియో
రాజమండ్రి గోదావరి బ్రిడ్జిపై రైలు ప్రయాణం నిజంగా ఓ అద్భుతమైన అనుభవం. ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ రాజమండ్రి, కొవ్వూరు మధ్య నిర్మించిన ఈ బ్రిడ్జి.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద రోడ్ కం రైల్ బ్రిడ్జి. సుమరు 4.4 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ఈ రైలు బ్రిడ్జి మీద ప్రయాణం చేసేటప్పుడు గోదావరి నది అందం, చల్లని గాలి, నదిలో ప్రయాణిస్తున్న రైలు శబ్దం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. తాజాగా గోదావరి బ్రిడ్జి మీద రైలు ప్రయాణానికి సంబంధించి లోకో మోటివ్ నుంచి తీసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెమ్మదిగా బ్రిడ్జి మీదికి చేరే రైలు వీడియో కనువిందు చేస్తోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
50 వసంతాలు పూర్తి చేసుకున్న రాజమండ్రి బ్రిడ్జి
గోదావరి జిల్లాలకు ఐకాన్ గా నిలిచి రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జి ఇప్పటికే 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1974లో ఈ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆసియాలోనే అత్యంత పొండవైన రెండో రోడ్ కం రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్రిడ్జి మీద పదుల సంఖ్యలో రైళ్లు, వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తాయి. ఈ బ్రిడ్జిని సుమారు 60 ఏళ్లు సేవలు అందించేలా నిర్మించారు. అయితే, మరో 20 ఏళ్లు దాని లైఫ్ టైమ్ ను పెంచేలా బ్రిడ్జికి పునరుద్ధరణ పనులు నిర్వహించారు అధికారులు. ఈ వంతెన రాజమండ్రికి రైలు, రోడ్డు ప్రయాణాన్ని కనెక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
జాతికి అంకితం చేసిన రాష్ట్రపతి ఫ్రకృద్దీన్
ఉభయ గోదావరి జిల్లాలను కలిగే ఈ బ్రిడ్జిన 1974 నవంబరు 23న నాటి రాష్ట్రపతి ఫ్రకుద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ఈ వంతెనను జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రైల్వే వంతెన భారతీయ ఇంజినీరింగ్ కు కొలమానం కాబోతుందన్నారు. రాజమండ్రి దగ్గర మలుపును అద్భుతంగా డిజైన్ చేశారు ఇంజినీర్లు. ఈ బ్రిడ్జి దేశంలో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిల్లో మూడో స్థానంలో ఉంది. అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై ఉన్న రైల్వే బ్రిడ్జి దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జిగా గుర్తింపు తెచ్చకుంది. రెండో అతిపెద్ద బ్రిడ్జి బీహార్ లోని సోన్ పూర్ దగ్గర ఉంది.
Read Also: లోకో పైలెట్లపై తీవ్ర పని ఒత్తిడి, రైల్వే విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి!