BB Telugu 8 Promo: తెలుగు బుల్లితెర ప్రేక్షకులనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమానికి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఎనిమిదవ సీజన్ కూడా చివరి దశకు చేరుకోబోతోంది. అందులో భాగంగానే 13వ వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ మొదలయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి 11వ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న కంటెస్టెంట్స్ 12వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా 12వ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న యష్మీ మాత్రమే ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందనుకున్న కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చారు నాగార్జున. ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి డేంజర్ జోన్ లో ఉన్న వారిని కాకుండా ఇంకొక వ్యక్తిని ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా తాజాగా 90వ రోజుకు సంబంధించి ప్రోమో ను విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. 13వ వారంలో భాగంగా మెగా చీఫ్ రోహిణి మినహా ప్రేరణ, గౌతమ్, విష్ణుప్రియ, టేస్టీ తేజ, అవినాష్, పృథ్వీ , నిఖిల్, గౌతమ్ ఇలా మొత్తం ఎనిమిది మంది నామినేషన్స్ లోకి వచ్చారు. నిన్నటితో ఓటింగ్ కాస్త ముగిసింది ఇక డేంజర్ జోన్ లో పృథ్వీ , విష్ణుప్రియ ఉండగా వీరిద్దరిని కాకుండా ఈరోజు శనివారం ఎపిసోడ్లో భాగంగా టేస్టీ తేజ అలాగే రేపటి ఎపిసోడ్లో భాగంగా పృథ్వీ ను ఎలిమినేట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు తాజాగా విడుదలైన ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
ప్రోమో మొదలవగానే స్టేజ్ పైకి వచ్చిన హోస్ట్ నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చారు. టికెట్ టు ఫినాలే గెలిచి ఈ నామినేషన్స్ నుంచి బయటకు వచ్చి, అవినాష్ ఫినాలేకే వెళ్లిపోయాడు అంటూ అవినాష్ కి కంగ్రాట్యులేషన్స్ తెలిపారు హోస్ట్ నాగార్జున. అంతేకాదు సీజన్ 8 కి ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ అంటూ తెలిపారు. ఇక అలాగే ప్రైజ్ మనీ కూడా రూ.54,30,000 విన్నర్ లిస్ట్ లోకి యాడ్ అయిందని తెలిపారు నాగార్జున. అన్ని సీజన్స్ కంటే హైయెస్ట్ ప్రైజ్ మనీ సార్ అంటూ తెలిపారు అవినాష్. ఇప్పుడు ఈ మాట అనొద్దు మైనస్ కూడా అవుతాయి అంటూ అన్నారు నాగార్జున.
నాగార్జున మాట్లాడుతూ.. ఈరోజు కొంతమందికి హౌస్ లో గోల్డెన్ టికెట్స్ ఇస్తాము. మరి కొంతమందికి బ్లాక్ టికెట్స్ ఇస్తామని తెలిపారు నాగార్జున. హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. నిఖిల్ ఈ హౌస్ లో ఫస్ట్ బ్లాక్ టికెట్ ఎవరికి వస్తుందో గెస్ చేయమని అడగగా.. నిఖిల్ ఇన్నోసెంట్ ఫేస్ పెడుతూ నాకు తెలియదు సర్ అంటూ తప్పించుకున్నారు. రోహిణి మాట్లాడుతూ.. గేమ్స్ వైస్ చూసుకుంటే పృథ్వీకి ఇస్తారు అంటూ తెలిపింది. అయితే మధ్యలో కాస్త రోహిణి , పృథ్వీ కి మిస్ అండర్ స్టాండింగ్ రాగా.. వెంటనే నాగార్జున నబీల్ కి ఫస్ట్ బ్లాక్ టికెట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత తేజ, ప్రేరణ, విష్ణు ప్రియకి కూడా బ్లాక్ టికెట్ ఇచ్చారు నాగార్జున. మొత్తానికైతే గోల్డెన్ టికెట్ , బ్లాక్ టికెట్ అంటూ సరికొత్త ఉత్కంఠ రేకెత్తించారు.