VD -14: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కెరియర్ స్టార్టింగ్ లోనే హీరోగా స్టార్డం సంపాదించారు. కానీ ఈ మధ్యకాలంలో కాస్త ఫ్లాప్స్ ని ఎదుర్కొంటున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ చేసిన ఏ సినిమా కూడా అంత హిట్ అవ్వలేదు. భారీ బడ్జెట్ తో వచ్చిన ‘లైగర్’ వంటి పాన్ ఇండియా మూవీ కూడా బెడిసికొట్టింది. అలాగే ‘ఖుషి’ మూవీ అంతంత మాత్రంగానే హిట్. అటు ‘ది ఫ్యామిలీ స్టార్’ కూడా అంతే. దాంతో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ ‘కింగ్డమ్’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కింగ్డమ్ మూవీకి సంబంధించి అన్ని పూర్తయ్యాయి. ఇక మే 30న విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసి, ఆ తర్వాత సినిమాని జులై 4కి వాయిదా వేశారు. అయితే కింగ్డమ్ విషయం పక్కన పెడితే..విజయ్ దేవరకొండ రాబోయే రెండు సినిమాలపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
VD14 పై భారీ బడ్జెట్..
విజయ్ దేవరకొండ కింగ్డమ్ తర్వాత ‘రౌడీ జనార్ధన్’ మూవీలో నటిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రౌడీ హీరోకి జోడిగా కీర్తి సురేష్ (Keerthi Suresh) నటిస్తోంది. ఈ సినిమా రవి కిరణ్ కోలా(Ravi Kiran kola) డైరెక్షన్లో వస్తుంది. ఇక ఈ సినిమా విషయం కాస్త పక్కన పెడితే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ 14వ సినిమా రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో రాబోతోంది.ఇప్పటికే వీరి కాంబోలో ‘టాక్సీవాలా’ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఫిక్స్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అలా విజయ్ – రష్మిక కాంబో అంటే సినిమా ఏ లెవెల్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమా గురించి ఓ రూమర్ వినిపిస్తోంది. అదేంటంటే భారీ బడ్జెట్..VD 14 సినిమా పీరియాడికల్ జానర్లో తెరకెక్కిస్తున్నారట.
భారాన్ని విజయ్ మోయగలడా?
ఈ మధ్య బాలీవుడ్ లో వచ్చిన ‘ఛావా’ మూవీ తరహాలో VD14 సినిమాని తీసుకురావాలని మూవీ మేకర్స్ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా స్టార్ట్ చేశారట. అలాగే VD14 మూవీని దాదాపు రూ.200 నుండి రూ.300 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి తీయాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే VD 14 మూవీ 2025 చివర్లోకల్లా సెట్స్ మీదకు తీసుకెళ్లి 2026 చివర్లో లేదా 2027 మొదట్లో ఈ విడుదల చేయాలని చూస్తున్నారట. అలా VD14 బడ్జెట్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఈ రూమర్ వినిపించడంతో చాలామంది రూ.300 వందల కోట్ల బడ్జెట్ అంటే ఇది విజయ్ దేవరకొండ కెరియర్ లోనే హైయ్యెస్ట్ అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే కింగ్డమ్ సినిమా హిట్ అయితేనే విజయ్ దేవరకొండ మిగతా సినిమాలపై హైప్ పెరుగుతుంది. మరి చూడాలి కింగ్డమ్ రిజల్ట్ ఎలా ఉంటుందో..
ALSO READ:Tollywood: చైన్ స్మోకర్ గా మారిన యంగ్ బ్యూటీ.. 2 గంటల్లోనే 15 సిగరెట్లు.. మామూల్ది కాదుగా!