Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆమె కేరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో నటించింది.. మరెన్నో అవార్డులు సొంతం చేసుకుంది. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగులో సరైన హిట్ సినిమా పడలేదు.. మాయో సైటిస్ వ్యాధి కారణంగా సినిమాలకు ఏడాది పాటు దూరం అయ్యింది. ఆ తర్వాత రెండు సినిమాలు చేసింది. కానీ ఏ ఒక్క సినిమా హిట్ అవ్వలేదు. దాంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వెబ్ సిరీస్ లు చేస్తూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనే బిజీ అవ్వాలని చూస్తుంది.. ఇక సామ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలుసు. లేటెస్ట్ ఫోటోల ను షేర్ చెయ్యడంతో పాటుగా పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది.. తాజాగా సామ్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఆ ఫోటోను చూసిన వారంతా షాక్ అవుతున్నారు.
ఇటీవల సెలెబ్రేటిల డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలను ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేస్తున్నారు.. అందులో టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నకు వరుస షాక్ లు తగిలాయి. ఇప్పుడు ఏఐ సాయం తో సమంత బేబీ బంప్ ఫోటోలు తయారు చేశారు.. సామ్ కు త్వరలో పిల్లలు పుట్టబోతున్నారని ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇలాంటివి చూసి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ పిచ్చి పనులకు సెలబ్రిటీలను వాడేసుకోవడం అన్యాయమని మండిపడుతున్నారు. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న సమంతకు ప్రెగ్నెన్సీ అని పుకారు సృష్టించడం దారుణం. అసలు సామ్ ఎవరికి ఏం అన్యాయం చేసింది. ఇలాంటి ఎదవ పని చేశారు అని కామెంట్ల రూపం లో నెట్టింట రచ్చ చేస్తున్నారు..
అటు సామ్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టింది. కొన్నిసార్లు పరిగెత్తడం మానేసి కూర్చుంటే బాగుంటుంది. కాసేపైనా ఆ హడావుడిని పక్కన పెట్టేయాలి. ఈ బిజీ ప్రపంచంలో మనమంతా కోరుకునేది ఒక సామాన్య జీవితం. అసలు ఏం చేయాలన్న ప్రణాళిక లేకపోవడం కూడా ఒక ప్లానేమో అన్నట్లు అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో ఫోటోలలో నిద్ర పోతున్నట్లు కనిపిస్తుంది. గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాల తో తెలుగు ఆడియన్స్ ను పలకరించిన సమంత ఈ ఏడాది ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌తో అలరించింది.. ప్రస్తుతం ఈమె సినిమాలు చేసేందుకు సిద్ధంగా లేదని టాక్. కొత్త సినిమాలు వస్తున్నా రిజెక్ట్ చేస్తుందని సమాచారం.. మరి తెలుగులో ఇక సినిమాలు చేస్తుందా అని ఆమె ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇక ముంబై లో సొంతంగా ఇల్లు కొనుక్కొని సెటిల్ అయ్యింది. ఇక నాగ చైతన్య విషయానికొస్తే ఇటీవలే శోభితా దూళిపాళ్ళను పెళ్లి చేసుకున్నాడు.. వీరిద్దరూ వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ అవుతున్నారు..