Happy New Year 2025: మరికొద్ది రోజుల్లో 2024 పూర్తి కాబోతోంది. కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2025 సెలబ్రేషన్స్ ను క్రేజీగా ప్లాన్ చేస్తున్నారా? విదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలను జరపుకోవాలి అనుకుంటున్నారా? అయితే, వీసా లేకుండా.. ఫ్రెండ్లీ బడ్జెట్ లో వెళ్లే కొన్ని బెస్ట్ టూరిజం కంట్రీస్ ఉన్నాయి. ఇంతకీ ఆదేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వీసా లేకుండా వెళ్లాలనుకునే బెస్ట్ కంట్రీస్
⦿థాయిలాండ్
న్యూ ఇయర్ సందర్భంగా ఫారిన్ లో ఎంజాయ్ చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ థాయ్ లాండ్. ఇక్కడికి వెళ్లాలి అనుకుంటే, పాస్ పోర్టు ఉంటే సరిపోతుంది. 60 రోజుల పాటు వీసా లేకుండా ఆ దేశంలో ఎంజాయ్ చేసేందుకు థాయ్ లాండ్ అనుమతిస్తుంది. ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి.
⦿సీషెల్స్
టూరిస్టులకు హాట్ ఫేవరెట్‌లలో ఒకటి సీషెల్స్. ఇక్కడి బీచ్ ప్రేమ పక్షులకు స్వర్గధామం. ఈ అందమైన ఆఫ్రికన్ దేశంలో భారతీయలు నెల రోజుల వరకు వీసా లేకుండా ఉండవచ్చు.
⦿హాంకాంగ్
ఆన్ లైన్‌లో ప్రీ-అరైవల్ రిజిస్ట్రేషన్ (PAR) పూర్తి చేసిన తర్వాత.. ఇండియన్స్ హాంకాంగ్ లో 14 రోజుల వరకు వీసా లేకుండా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. పగటిపూట పర్యాటక ప్రాంతాలు, రాత్రిపూట బార్ హాప్ లో షాపింగ్ ఓ క్రేజీ అనుభూతిని కలిగిస్తుంది.
⦿మలేషియా
మలేషియా కూడా ఇండియన్స్ ను వీసా లేకుండా ఆహ్వానిస్తుంది. 30 రోజుల వరకు ఇక్కడ వీసా లేకుండా గడిపే అవకాశం ఉంది. కౌలాలంపూర్ ఐకానిక్ పెట్రోనాస్ టవర్లతో పాటు లంకావిలోని అందమైన బీచ్ లాంజ్ లో ఎంజాయ్ చెయ్యొచ్చు!
⦿కజకిస్తాన్
కజకిస్తాన్ కూడా భారతీయకులకు వీసా లేకుండా ఎంట్రీకి అనుమతిస్తుంది. ఎన్నో ప్రకృతి అందాలకు నెలవైన ఈ దేశంలో న్యూ ఇయర్ ను ప్లాన్ చేస్తే జీవితాంతం మర్చిపోలేరు.
⦿మారిషస్
మారిషస్ లో మూడు నెలల పాటు వీసా లేకుండా ఉండే అవకాశం ఉంది. ఇక్కడి ఇక్కడి సహజమైన బీచ్‌లు, అద్భుతమైన లష్ ల్యాండ్ స్కేప్‌లను ఆస్వాదించవచ్చు.
⦿ఫిజీ
ఈ దేశం కూడా ఇండియన్స్ ను 4 నెలల పాటు వీసా లేకుండా ఉండే అవకాశం కల్పిస్తున్నది. ఇక్కడ కూడా అద్భుతమైన బీచ్ లు, ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
⦿టర్కీ
టర్కీ ఇండియన్స్ కు 180 రోజులు చెల్లుబాటు అయ్యే ఈవీసాను అందిస్తుంది. ఈ వీసా ఉంటే ఒక్కో ఎంట్రీలో నెల రోజుల పాటు అక్కడ ఉండేందుకు అవకాశం ఉంటుంది.
⦿అజర్‌బైజాన్
ఉష్ణమండల బీచ్‌లు, దట్టమైన పర్వతాల ఈ దేశంలో ఎంతో ఫేమస్. ఈ దేశం కూడా 90 రోజులు చెల్లుబాటు అయ్యే ఈ వీసాను అందిస్తున్నది.
⦿మాల్దీవులు
సహజమైన బీచ్‌లు, ప్రపంచ స్థాయి రిసార్ట్స్ తో లగ్జరీ, ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తున్నది మాల్దీవులు. భారతీయులు ఇక్కడ 30 రోజుల వరకు ఇక్కడ ఉండేందుకు అరైవల్ వీసాను అందిస్తుంది.
సో, 2025 న్యూ ఇయర్ వేడుకలను వీటిలో మీకు నచ్చిన దేశానికి వెళ్లి సెలబ్రేట్ చేసుకోండి.
Read Also: సంక్రాంతి వేళ తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఏపీకి 5 వేల స్పెషల్ బస్సులు!