BigTV English

Bomb Threat: సచివాలయానికి బాంబ్ బెదిరింపు..అలర్ట్ అయిన పోలీసులు

Bomb Threat: సచివాలయానికి బాంబ్ బెదిరింపు..అలర్ట్ అయిన పోలీసులు

Bomb Threat: ఈ మధ్య ఎక్కడ చూసిన బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు తాజాగా తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయానికి బాంబ్ పెట్టి పేల్చేస్తామని ఫోన్ చేసి బెదిరించడంతో.. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది. వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు, పోలీసులు రంగంలోకి దిగి సచివాలయాన్ని పరిశీలించారు. కానీ అది ఫేక్ కాల్ అని ఎలాంటి బాంబు లేదని తెలిసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత మూడు రోజుల నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయి. అయితే కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు SPF పోలీసులు. ఎందుకు ఫోన్ చేశాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.


ఈ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి సయ్యద్ మీర్ మొహమద్ అలీ అని. వయసు ఇరవై రెండు సంవత్సరాలుగా గుర్తించారు పోలీసులు. సెక్రటేరియట్ ల్యాండ్ లైన్‌కి ఫోన్ చేసి లంగర్ హౌస్ లోని దర్గా గురించి ఫిర్యాదు చేశారనీ.. అందుకే తాను సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని, ఈ యువకుడు బెదిరించినట్టు చెబుతున్నారు పోలీసులు. ఇతడ్ని దారుసలాం దర్గా దగ్గర పట్టుకున్నారు TGSPF పోలీసులు.. ఇతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Also Read: చెప్పాం.. చేసి చూపించాం.. రాహుల్ మాట నిలబెట్టాం.. సీఎం రేవంత్ కామెంట్స్


ఇదిలా ఉంటే.. ఇటీవల జనవరి 29న శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయనికి బాంబు ఉందంటూ కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. నితిన్ అనే వ్యక్తి విమానాశ్రయానికి సుమారు 100 కాల్స్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×