BigTV English

Samantha in Allu Arjun – Atlee Movie: అల్లు అర్జున్- అట్లీ సినిమాలో సమంత.. రూ. 1000 కోట్లు గ్యారెంటీ..?

Samantha in Allu Arjun – Atlee Movie: అల్లు అర్జున్- అట్లీ సినిమాలో సమంత.. రూ. 1000 కోట్లు గ్యారెంటీ..?


Samantha Lead role in Allu Arjun – Atlee Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో కూడా పెట్టాడు. ఇప్పటికే త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నాడు బన్నీ. అది అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఇది కాకుండా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ కు ముందే వివాదాల మధ్యలో చిక్కుకుంది. దానికి కారణం అట్లీ.

బాలీవుడ్ లో జవాన్ సినిమాతో మంచి హిట్ కొట్టిన అట్లీ.. ఈ సినిమా తరువాత రెమ్యూనిరేషన్ పెంచేశాడు. దీంతో బన్నీ సినిమాకు కూడా పెంచిన రెమ్యూనిరేషన్ చెప్పడంతో నిర్మాతలు ఆలోచిస్తున్నారని టాక్. ఇక ఇప్పుడు ఆ రెమ్యూనిరేషన్ ఏం వద్దు.. సినిమా లాభాలలో వాటా అడిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సమస్యలే ఇంకా ముగియలేదు అంతలోనే ఈ సినిమాలో హీరోయిన్ సమంత అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఏడాది రెస్ట్ తరువాత ఈ మధ్యనే సామ్.. మళ్లీ కెమెరా కంటికి కనిపిస్తుంది. అమ్మడి చేతిలో ఉన్న ఏకైక సిరీస్ సిటాడెల్. ఇది కూడా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. లేడీ స్పై గా సామ్ కనిపించనుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. AAA సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని అట్లీ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. సామ్ కు, అట్లీకు మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది. ఇప్పటికే అట్లీ దర్శకత్వం వహించిన తేరి సినిమాలో విజయ్ సరసన సామ్ నటించి మెప్పించింది.


Also Read: Ruhani Sharma: రుహనీ.. నువ్వేనా.. ఇంత ఘాటు శృంగారమా..?

ఇంకోపక్క అల్లు అర్జున్ సరసన కూడా సామ్ నటించింది. సన్నాఫ్ సత్యమూర్తిలో బన్నీ సరసన హీరోయిన్ గా నటించిన సామ్.. పుష్పలో ఐటెం సాంగ్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఇప్పుడు AAA లో కూడా ఛాన్స్ పట్టేసిందని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ఈ సినిమా మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా మారుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అక్టోబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ వార్త విన్న అభిమానులు.. ఈ కాంబో ఫిక్స్ అయితే రూ. 1000 కోట్లు గ్యారెంటీ..? అంతో కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాలి. ఇకపోతే బన్నీ నటించిన పుష్ప 2 ఆగస్టు 15 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Related News

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Big Stories

×