Samantha : సౌత్ టు నార్త్ వెళ్లి సెటిల్ అయిన హీరోయిన్లలో రష్మిక మందన్న జోరు మీద ఉంది. అన్ని ఇండస్ట్రీలలో ఈమె పేరు మారు మోగిపోతుంది. ప్రస్తుతం ఈమె ట్రెండింగ్ లో ఉంది. రష్మిక హవా నడుస్తుంది కానీ తన కంటే ముందే పాన్ ఇండియా ఆడియెన్స్ ని రీచ్ అయ్యిన బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది సమంత అనే చెప్పాలి. టాలీవుడ్ హీరోయిన్ సమంత ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది. కానీ ఈ మధ్య తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యింది. కేవలం బాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే సామ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. రిస్క్ వద్దంటున్నారు ఫ్యాన్స్.. అసలు సామ్ ఏం చేస్తుందో ఒకసారి చూసేద్దాం.
హీరోయిన్ సమంత గత మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవల చేసిన వెబ్ సిరీస్ సిటాడెల్ తో పలకరించింది. దీని తర్వాత మరో భారీ సిరీస్ అది కూడా తుంబాడ్ లాంటి సినిమా దర్శకుడు అనీల్ రాహి బర్వెతో రక్త బ్రహ్మాండ్ అనే సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. అయితే తెలుగులో కూడా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇలాంటి రిస్క్ అవసరమా? తొందరపడి రిస్క్ లో పడొద్దు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం.. అతని మరణంతో..
అసలు విషయానికొస్తే.. తెలుగులో ఎలాంటి కొత్త సినిమా ఆమె ఓకే చెయ్యలేదు కానీ ఆమె చేయాల్సి ఉన్న ఓ సినిమా ఎపుడు నుంచో పూర్తి కావాల్సి ఉంది. మరి ఈ చిత్రాన్ని ఇపుడు సమంత కంప్లీట్ చేసేందుకు మళ్ళీ తెలుగు సినిమాలోకి వస్తుందట.. అయితే ఈ ఈసారి తెలుగులో సినిమాలు చెయ్యడంతో పాటుగా నిర్మాతగా కూడా వ్యవహారిస్తుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఆ చిత్రమే ‘మా ఇంటి బంగారం’. ఎలాంటి హీరో లేకుండా కేవలం హీరోయిన్ బ్యాక్ డ్రాప్ లోనే మేకర్స్ ఈ సినిమాని అనౌన్స్ చేసారు. సో తెలుగులో తన సినిమా ను సామ్ వచ్చి కంప్లీట్ చేయాలని చూస్తుందట. ఇక ఈ సినిమా మినహాయిస్తే తెలుగులో మరో సినిమా చేసేందుకు అంత ఆసక్తిగా లేదనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా మినహాయిస్తే తెలుగులో మరో సినిమా చేసేందుకు అంత ఆసక్తిగా లేదనే వినిపిస్తుంది.. ఈ మూవీ డైరెక్టర్ ఎవరు అన్న విషయం త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి.. ఇక సామ్ ప్రస్తుతం ముంబై కే షిఫ్ట్ అయ్యింది. వరుసగా వెబ్ సిరీస్ లు చేసుకుంటుంది. అవి ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో చూసాము.. ప్రస్తుతం ఈమె పెళ్లి గురించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సామ్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు..