BigTV English

Samantha : జయం రవికి నెలకు 40 లక్షల భరణం డిమాండ్… మద్యలో సమంత – చై డివోర్స్ వివాదం..

Samantha : జయం రవికి నెలకు 40 లక్షల భరణం డిమాండ్… మద్యలో సమంత – చై డివోర్స్ వివాదం..

Samantha : కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వరుసగా విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు హీరోలు తమ భాగస్వామితో విడిపోయారు. అందులోనూ వాళ్లంతా స్టార్ హీరోలు కావడంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక లిస్ట్ లోకి కోలీవుడ్ హీరో జయం రవి చేరాడు. ఈయన ఇటీవలే తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ పోస్ట్ కాస్త ఇండస్ట్రీ వర్గాల్లో దుమారం రేపింది. ఫైనల్ గా విడాకులు అయితే తీసుకున్నాడు. కానీ ఇప్పటికీ తన భార్య ఆర్తి జయం రవి పై ఆరోపణలు చేస్తుంది. ఇక తాజాగా నెలకు 40 లక్షలు భరణం ఇవ్వాలని డిమాండ్ చేసింది.. దీంతో మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉండగా వీరిద్దరి మధ్యలో సమంత పేరు వినిపిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


నెలకు రూ.40 లక్షలు భరణం కోరిన ఆర్తి.. 

కోలీవుడ్ హీరో జయం రవి, ఆర్తి విడాకుల వివాదం రోజురోజుకు ముదురుతుంది. తన భర్తకు సింగర్ కేనీషా ఫ్రాన్సిస్‌తో ఎఫైర్ ఉందంటూ ఆరోపణలు చేసింది. ఆ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెట్టింది. ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసిన సరే జయం రవి మాత్రం కరగలేదు. ఏది ఏమైనా నాకు విడాకులు కావాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు. 18 ఏళ్లు తనతో కాపురం చేసిన వ్యక్తి ఇలా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏం జరిగినా తన బిడ్డల కోసం మౌనంగా భరించానని .. భర్తగా, తండ్రిగా జయం రవి తన బాధ్యతల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని ఆర్తి రవి ఆరోపించారు. తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగానే రవి మరో అమ్మాయితో తన బంధాన్ని బయటపెట్టారని ఆమె సీరియస్ అయ్యారు.


వీరిద్దరూ విడాకులు కోసం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.. ఇక దీనిపై విచారించిన న్యాయస్థానం రాజీ కోసం కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించింది. అయితే ఆర్తితో ఇకపై కలిసి జీవించే ఉద్దేశం లేదని రవి తేల్చి చెప్పడంతో, రవికి విడాకులు మంజూరు చేయాలని అతని టీమ్ న్యాయస్థానాన్ని కోరింది. ఇదే సమయంలో రవి తనకు విడాకులు ఇస్తుండటంతో నెలకు రూ.40 లక్షలను భరణం కింద ఇప్పించాలని ఆర్తి పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్ నువ్వు స్వీకరించిన కోర్టు ఈ కేసును వచ్చే నెల 12 కి వాయిదా వేసింది. మరి అప్పుడు జయం రవి ఆమెకు నెలకు 40 లక్షల భరణం ఇస్తారు ఇవ్వరో తెలియనుంది.. ఇదిలా ఉండగా వీరిద్దరి వివాదంలో నాగచైతన్య సమంత పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సమంత విడాకులు తీసుకున్నందుకు డబ్బులు తీసుకుందా లేదా అన్నది ఇక్కడ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

Also Read :నితిన్ తమ్ముడుకు అడ్డంకి..టైం చూసి దెబ్బ కొట్టారుగా..

నాగ చైతన్య – సమంత విడాకులపై మరోసారి చర్చ.. 

టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే నాగచైతన్య నుంచి సమంత భరణం తీసుకోలేదని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి పేర్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే విడాకులు తీసుకున్నప్పుడు సమంత నాగచైతన్య నుంచి భరణం తీసుకోలేదు. అందరు సమంత లాగా ఉండరు. భర్తతో కలిసి కొన్న ఆస్తులను కూడా సమంత వెనక్కి తీసుకోలేదని సమాచారం. కానీ ఆర్తి మాత్రం డబ్బుల కోసం కోర్టుకు వెళ్లిందని స్పష్టం అవుతుందని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే భరణం ఇస్తానని జయం రవి మాత్రం ఇంకా చెప్పలేదు. జూన్ 12న ఫైనల్ విచారణలో ఏం చెప్తారో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×