BigTV English

Samantha: ఆ సీన్స్ కి తెగ ఎంజాయ్ చేశా.. ఇంత కక్ష ఎందుకు సమంత..!

Samantha: ఆ సీన్స్ కి తెగ ఎంజాయ్ చేశా.. ఇంత కక్ష ఎందుకు సమంత..!

Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత (Samantha ) ఈమధ్య బాలీవుడ్ లోనే ఎక్కువగా వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా మారిపోయింది. మరోవైపు ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ ను స్థాపించి, ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం మే 4న వైజాగ్ లోని ఆర్కే బీచ్ దగ్గర ఉన్న నోవాటెల్ హోటల్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమంత ఈ సినిమాలో ప్రత్యేకించి కొన్ని సన్నివేశాలను తెగ ఎంజాయ్ చేశారు అని కొందరు చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది చూసిన చాలామంది ఎందుకు అబ్బాయిలంటే ఇంత కక్ష.. నాగచైతన్య (Naga Chaitanya) పై కోపంతోనే ఇలా మాట్లాడుతున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి సమంత ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం.


ఆ సన్నివేశాలకు సమంత చాలా ఎంజాయ్ చేసింది – చరణ్

శుభం (Subham ) సినిమాలో చాలావరకు కొత్తవాళ్లు, యూట్యూబర్స్, సోషల్ మీడియా ద్వారా పేరు తెచ్చుకున్న నటీనటులు నటించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాలో నటించిన నటీనటులతో యాంకర్ కాసేపు ఫన్నీగా చిట్టి చాట్ నిర్వహించారు. ఈమె అడిగిన ప్రశ్నలకు వారు కూడా సరదాగా సమాధానం తెలిపారు. ఈ క్రమంలోనే యాంకర్ ప్రశ్నిస్తూ.. సమంత ఈ శుభం సినిమాలో ఎలాంటి సీన్స్ కి బాగా ఎంజాయ్ చేశారు? అని అడగగా.. దీనికి నటుడు చరణ్ పేరీ సమాధానం ఇస్తూ.. సినిమాలో భార్యలు భర్తల్ని కొట్టే సీన్ అయితే సమంత గారు చాలా ఎంజాయ్ చేశారు. క్రేజీ అసలు. మమ్మల్ని కొడుతుంటే సమంత గారు ఫుల్ ఎంజాయ్ చేశారు” అంటూ చరణ్ తెలిపారు. ఇక ఈ విషయం విని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాగచైతన్య కారణంగానే సమంత ఇలా మారిపోయిందని, అందుకే భార్యలు భర్తల్ని కొడుతుంటే తన రియల్ లైఫ్ లో తానేమి చేయలేకపోయాను కాబట్టి ఇక్కడ తెరపై కనిపిస్తున్న సన్నివేశాలను చూసి ఎంజాయ్ చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్లో కూడా స్ట్రిక్ట్ భర్తలు ఉంటే.. వాళ్ల భార్యలకు దెయ్యం పడితే ఎలా ఇబ్బంది పెట్టారు..? మగవాళ్ళని ఎలా టార్గెట్ చేశారు? అని ఈ సినిమాలో చూపించారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సాగే హారర్ కామెడీ సినిమాగా తెలుస్తోంది.


ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన శుభం మూవీ..

ఇక ఈ సినిమా ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు. దీనికి తోడు జన్మజన్మల బంధం అంటూ మొన్న ఒక పాటను రిలీజ్ చేయగా.. ఈ పాట కూడా అందరి హృదయాలను దోచుకుంది. నేటివిటీకి తగ్గట్టుగా చాలా చక్కగా డిజైన్ చేశారని పలువురు ప్రశంసలు కురిపించారు. మరి మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శుభం మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

ALSO READ:Singer Sonu Nigam: స్టార్ సింగర్ పై నిషేధం.. ఎక్కడ?ఏం జరిగిందంటే..?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×