Upcoming Movies : ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులోను సోమవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయని, సినీ ప్రియులు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఓటీటీలో ఈ మధ్య కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపలే ఓటీడీలో స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకుంది.
అదే విధంగా ఈ నెలలో రిలీజ్ అయిన హిట్ 3, రెట్రో మూవీలు బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి.. ప్రస్తుతం హిట్ 3 బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది.. భారీ యాక్షన్ సన్నివేశాల్లో నాని నటించడంతో ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇక ఈ మూవీ తో పాటు పలు సినిమాలు ఓటీడీలో రిలీజ్ అయినందుకు డేట్లని లాక్ చేసుకున్నాయి. ఈ వారం థియేటర్లలో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ మూవీలు ఏవో ఒక లుక్ వేద్దాం పదండీ..
థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు..
సింగిల్..
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు,కేతిక శర్మ, ఇవానా నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ రాజు తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించారు. మే 9న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది..
శుభం..
టాలీవుడ్ హీరోయిన్ సమంత నిర్మాణ సంస్థల వస్తున్న సినిమా శుభం.. ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ లో నటిస్తుంది. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం మే 9న థియేటర్లలోకి రానుంది..
కలియుగమ్-2064..
శ్రద్ధా శ్రీనాధ్, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కలియుగమ్-2064.. తమిళం తెలుగులో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. 2064లో మనుషులు ఎలా ఉంటారో ఇందులో చూపించనున్నారు. ఈ తరానికి అవసరమైన చిత్రమని, అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని మేకర్ చెప్తున్నారు. ఈ సినిమా మే 9న థియేటర్లలోకి రాబోతుంది.
వీటితోపాటుగా నవీన్ చంద్ర, రాశీసింగ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాకేశ్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘బ్లైండ్ స్పాట్’.. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కూడా మే 9న రీ రిలీజ్ కాబోతోంది.
ఇక మే నెలలో బోలెడు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. అదే విధంగా మార్చి నెల వచ్చేసింది. ఈ నెల మొదటి వారం కొత్త కొత్త సినిమాల తో పాటుగా గతంలో రిలీజ్ అయిన ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అవేంటో చూసేద్దాం..
Also Read:జాను డ్యాన్సర్ గా ఎందుకు మారిందో తెలుసా..? ఇన్నిరోజులకు బయటపెట్టిన నిజం..
ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు..
నెట్‌ఫ్లిక్స్..
ది మ్యాచ్ (మూవీ) మే 7
లాస్ట్ బుల్లెట్ (మూవీ) మే 7
గుడ్ బ్యాడ్ అగ్లీ (తమిళ/తెలుగు) మే 08
ది హాంటెడ్ అపార్ట్‌మెంట్ ‘మిస్సిక్’ (మూవీ) మే8
బ్యాడ్ ఇన్‌ఫ్లూయెన్స్ (మూవీ) మే 8
ది డిప్లొమ్యాట్ మే 9
ది రాయల్స్ (వెబ్‌సిరీస్) మే 9
అమెజాన్‌ప్రైమ్ వీడియో..
గ్రామ్ చికిత్సాలయమ్ (హిందీ) మే 09
ఈటీవీ విన్..
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (తెలుగు) మే 08
జియో హాట్‌స్టార్..
స్టార్ వార్స్ (యానిమేషన్) మే 04
యువ క్రైమ్ ఫైల్స్ (మూవీ) మే 5
పోకర్ ఫేస్ (వెబ్‌సిరీస్) మే 9
ప్రస్తుతానికి ఈ సినిమాలు మాత్రమే ఓటీటీ డేట్ ని లాక్ చేసుకున్నాయి.. ఇక మరికొన్ని సినిమాలు సడన్గా ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంది..