BigTV English

Samantha: నాగచైతన్య- శోభితా పెళ్లిపై తొలిసారి స్పందించిన సామ్..  అలా అనేసిందేంటి.. ? 

Samantha: నాగచైతన్య- శోభితా పెళ్లిపై తొలిసారి స్పందించిన సామ్..  అలా అనేసిందేంటి.. ? 

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మంచి మంచి ప్రాజెక్ట్స్ ను వింటూ చాలా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తుంది. ఒక ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ చిన్నది.. ఇప్పుడిప్పుడే వరుస ప్రాజెక్ట్స్ ను లైన్లో పెడుతుంది. సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ తో అమెజాన్ ఒరిజినల్స్ లోకి అడుగుపెట్టిన ఆమె..  ప్రస్తుతం మరో వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. ఇక సినిమాలు కాకుండా ఒకపక్క యాడ్స్.. ఇంకోపక్క పికిల్ బాల్  కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతోంది.


ఇక సినిమాల విషయం పక్కన పెడితే సామ్ సోషల్ మీడియాలో ఎప్పుడు సెన్సేషన్ సృష్టిస్తూనే ఉంటుంది. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన ఈ చిన్నది.. నాలుగేళ్లు నిండకుండానే విభేదాలతో విడాకులు తీసుకున్నది. ఇక చైతో విడాకుల అనంతరం ఎక్కువ ట్రోల్ కి గురయ్యింది కూడా సామ్ నే. ఆమె చేసిన పనుల వలనే చై విడాకులు ఇచ్చాడని, ఆమె ప్రవర్తన బాలేదని, చెప్పుడు మాటలు విన్నదని, బోల్డ్ సీన్స్ చేసి అక్కినేని పరువు తీసిందని.. స్టైలిష్  జుకాల్కర్ తో సంబంధం పెట్టుకుందని.. ఇలా ఒకటి కాదు. ఎన్నో పుకార్లు ఆమెపై వచ్చాయి. కానీ, ఏరోజు సామ్ ఒకరిని తప్పు పట్టలేదు. వాటన్నింటిని తట్టుకొని నిలబడింది.

విడాకుల తరువాత సామ్ మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఏడాది పాటు చికిత్స తీసుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. విడాకులు తీసుకున్నప్పుడు చై, సామ్.. తామిద్దరం ఫ్రెండ్స్ లానే విడిపోయామని, తమ నిర్ణయాన్ని గౌరవించాలని చెప్పుకొచ్చారు. ఇక ఆ పోస్ట్ పెట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు వారిద్దరూ ఒకరికొకరు ఎదురుపడిన దాఖలాలు లేవు. ఇంటర్వ్యూలలో చై అన్నా.. సామ్ గురించి మాట్లాడతాడేమో కానీ, సామ్ ఏ ఒక్కరోజు కూడా చై గురించి మాట్లాడలేదు. చివరికి భర్త అన్నా కూడా మాజీ అనమని కోరింది.


Mohan Lal L2: రిలీజ్ కు ముందే అరుదైన రికార్డు.. మలయాళ సినీ చరిత్రలోనే..?

మయోసైటిస్ తో పోరాడుతూ ఎంతో స్ట్రాంగ్ గా నిలబడిన సామ్.. తాజాగా చై రెండో పెళ్లిపై స్పందించింది. గతేడాది నాగచైతన్య, శోభితా వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. సామ్ కు విడాకులు ఇచ్చిన అనంతరం చై.. శోభితాతో డేటింగ్ లో ఉన్నాడు. రెండేళ్ల ప్రేమ తరువాత  ఇరువర్గాల కుటుంబాలను ఒప్పించి డిసెంబర్ 4 న వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. సమంత ప్లేస్ లో వచ్చిన శోభితాకు కూడా ట్రోల్స్ తప్పలేదు. సామ్ అంత అందంగా లేదని కొందరు .. డైమండ్ ను వదిలి గోల్డ్ ను పెళ్లి చేసుకున్నాడని ఇంకొందరు విమర్శించారు.

ఇక తాజాగా  ఒక ఇంటర్వ్యూలో  మీ మాజీ భర్త కొత్త బంధంలోకి అడుగుపెట్టడం మీకు అసూయగా ఉందా.. ? అని అడగ్గా  సామ్ మాట్లాడుతూ.. ” నా లైఫ్ లో అసూయకు తావు లేదు. అది నా  జీవితంలో భాగం కావడం కూడా నేనుఅంగీకరించను. అసూయే అన్ని చెడు పనులకు కారణమని భావిస్తాను” అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పాత రిలేషన్ తాలుకు గాయాల నుంచి బయటపడడానికి చాలా శ్రమించాను అని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. చై రెండో పెళ్లిని ఇంత లైట్ గా తీసుకోవడంపై అభిమానులు షాక్ అవుతున్నారు. ఎదుటివారు చెడును కోరుకోకుండా ఎవరి లైఫ్ ను వారు మంచిగా బతకనివ్వడమే నిజమైన సక్సెస్.. అది సామ్ అంటే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×