Samantha.. సమంత (Samantha) నటనతోనే కాదు యాక్షన్ పర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు.. తాజాగా ‘ఐకానిక్ గోల్డ్ అవార్డు’ లభించింది. అసలు విషయంలోకెళితే.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ‘సిటాడెల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ గత ఏడాది విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కీలక పాత్ర పోషించింది.తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అంతేకాదు తన అద్భుతమైన నటనతో బాలీవుడ్ ఆడియన్స్ ని ఒక్కసారిగా మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇదే సినిమాలో సమంతతో పాటు వరుణ్ ధావన్ (Varun Dhawan), సికిందర్ కేర్ (Sikander kher), కేకే మీనన్ (KK Menon), సాకీబ్ సాలిమ్ (Saqib Saleem) వంటి వారు కీలక పాత్రలు పోషించారు. అయితే ఇప్పుడు ఈ సిరీస్ కి గాని తాజాగా సమంతకి ఐకానిక్ గోల్డ్ అవార్డు లభించింది. అలాగే ఉత్తమ వెబ్ సిరీస్ గా ప్రకటించడంతో ఈ అవార్డు తాజాగా అందుకోవడం గమనార్హం.
సమంతకు ఐకానిక్ గోల్డ్ అవార్డు..
ఇకపోతే ఐకానిక్ గోల్డ్ అవార్డు లభించడంతో డైరెక్టర్ డీకే (Director DK) తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దాని వెనుక ఎంతో మంది కృషి ఉంది. అవార్డుల రూపంలో మీరంతా చూపిస్తున్న ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ డీకే తన అభిప్రాయాన్ని సంతోషం రూపంలో తెలియజేశారు. ఇక దీంతో ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి కొంతమంది సెలబ్రిటీలు సమంతాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండడం గమనార్హం.
కట్టిపడేసిన సమంత..
ఇకపోతే ఇందులో సమంత తన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం సమంత ఎంత కష్టపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో సమంత ఒక ప్రాజెక్టు కోసం సీక్రెట్ ఏజెంట్ గా పని చేస్తూ ఉంటుంది. ఈమెకు నాడియా అనే కుమార్తె కూడా ఉంటుంది. ఇక ఇందులో వరుణ్ ధావన్ (Varun Dhawan) స్టంట్ మాస్టర్ గా పనిచేయగా.. బన్నీగా సీక్రెట్ ఏజెంట్ గా సమంతతో కలిసి పని చేస్తూ ఉంటారు. విశ్వ అనే పేరుతో పని చేసే జగన్ కోసమే వీరిద్దరూ పనిచేస్తూ ఉంటారు. ఇకపోతే సీక్రెట్ ఏజెంట్ గా పని చేసే సమయంలో వీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. డేవిడ్ వద్ద ఉన్న సమాచారం ఏంటి? దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? రాహి గంభీర్ తో లవ్ ఎలా కొనసాగింది? అనే విషయాలపై ఈ వెబ్ సిరీస్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. మొత్తానికి అయితే సమంత పడిన కష్టానికి ఎట్టకేలకు ప్రతిఫలం లభించిందని అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇక సమంత వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు, అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నా కెరియర్ పరంగా వరుస సక్సెస్ లు అందుకుంటూ మరింత జోష్ లో ముందుకు సాగుతోంది. ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఎన్నో ఆమె వశం కావాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.