BigTV English

Mahesh Babu: నేను ఉన్నానో.. చచ్చానో కూడా తనకు తెలీదు.. మహేష్ బాబుపై సీనియర్ నటి కామెంట్స్

Mahesh Babu: నేను ఉన్నానో.. చచ్చానో కూడా తనకు తెలీదు.. మహేష్ బాబుపై సీనియర్ నటి కామెంట్స్

Mahesh Babu: ఒక రేంజ్‌లో స్టార్‌డమ్ సంపాదించుకున్న తర్వాత కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నట్టుండి వెండితెరపై నుండి కనుమరుగు అయిపోతారు. అలాంటి వారిలో రామేశ్వరి ఒకరు. ముందుగా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమయ్యారు రామేశ్వరి. ఆ తర్వాత తెలుగులో కూడా ఒకట్రెండు సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించారు. కానీ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘నిజం’ సినిమాలో ఆమె చేసిన పాత్రతోనే ఇప్పటి జెనరేషన్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయారు. ఆ మూవీ విడుదలయిన దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో యాక్టివ్ అయ్యారు రామేశ్వరి. తాజాగా మహేశ్ బాబుతో మళ్లీ సినిమా ఎప్పుడు అని అడగగా.. దానికి ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.


ఒక్క పాత్రతోనే పాపులారిటీ

‘నిజం’ (Nijam) సినిమాను తేజ డైరెక్ట్ చేశారు. హీరోగా మహేశ్ కెరీర్ అప్పుడే ప్రారంభమయినా కూడా ఇలాంటి ఒక సోషల్ మెసేజ్ కథతో ప్రేక్షకులను అలరించారని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఈ కథను ఎంచుకున్నాడు. ఇందులో హీరోగా మహేశ్ బాబుకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. తన తల్లి పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఆ తల్లి పాత్ర కోసం అప్పట్లో ఎంతోమంది సీనియర్ నటీమణులను సంప్రదించిన తర్వాత ఫైనల్‌గా ఆ ఛాన్స్ రామేశ్వరికి వచ్చింది. ఇదొక ప్రయోగాత్మక కథతో తెరకెక్కిన చిత్రం కావడంతో మూవీ ఫ్లాప్ అయినా కూడా ఇందులో రామేశ్వరి పాత్ర మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందుకే ఇప్పటికీ ఈ పాత్రను ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు.


వాళ్లంతా అంతే

తాజాగా బ్రహ్మానందం, తన కుమారుడు గౌతమ్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘బ్రహ్మా ఆనందం’ సినిమాలో కూడా రామేశ్వరి (Rameswari) ఒక కీ రోల్ ప్లే చేశారు. తాజాగా విడుదలయిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో రామేశ్వరి కూడా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. దానికోసమే పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో మహేశ్ బాబు (Mahesh Babu)తో మళ్లీ సినిమా ఎప్పుడూ అనే ప్రశ్న ఆమెకు ఎదురయ్యింది. ‘‘బహుశా నేను ఉన్నానో చచ్చానో కూడా వాళ్లకు తెలియదు. పచ్చిగా చెప్పాలంటే వాళ్లంతా అలాగే ఉంటారు. అలా అని అందరూ కాదు. వాళ్లంతా వేరే ప్రపంచంలో బ్రతుకుతుంటారు. దాని గురించి నేను ఆలోచించను’’ అని సూటిగా చెప్పేశారు రామేశ్వరి.

Also Read: మహేష్ బాబు నన్ను మూడు సార్లు కిందపడేశాడు.. ఆ షాకింగ్ ఘటనపై నటి రామేశ్వరి కామెంట్స్

అందరినీ ఉద్ధేశించే

కేవలం మహేశ్ బాబును మాత్రమే కాదు.. చాలామంది స్టార్ హీరోలను ఉద్దేశించే రామేశ్వరి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. స్టార్‌డమ్ వచ్చిన తర్వాత తమతో పనిచేసిన ఆర్టిస్టులను పట్టించుకోరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ మహేశ్ బాబు విషయంలో రామేశ్వరి మరొక మాట కూడా అన్నారు. ‘నిజం’ విడుదలయిన చాలాకాలం తర్వాత ఏదో అవార్డ్ ఫంక్షన్‌లో ఈ హీరోను కలిశారట రామేశ్వరి. అప్పుడు తనతో వచ్చి మాట్లాడొచ్చు కదా అని అడిగారట. దానికి సమాధానంగా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మాట్లాడలేదు అని చెప్తే.. మీరు నన్ను కొట్టి మాట్లాడొచ్చు అంటూ చనువుగా మాట్లాడాడట మహేశ్ బాబు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×