మొదటి డేట్ లోనే అమ్మాయిలకు మీరు నచ్చేలా ప్రవర్తించాలి. అలా నచ్చకపోతే ఆ అమ్మాయి తిరిగి మిమ్మల్ని చూడడానికి ఇష్టపడదు. కాబట్టి మొదటి డేట్ కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
నవ్వుతూ హాయ్
మీరు ఒక అమ్మాయిని మొదటిసారి కలిసినప్పుడు నవ్వుతూ పలకరించండి. ఆ సమయంలో మీరు ఉల్లాసంగా కనిపించాలి. అలా అని మితిమీరిన ఆనందంతో కనిపించకండి. కరచాలనం చేసి పలకరించడం అనేది సరైన మార్గం. అయితే అది ఎదుటి స్త్రీకి అసౌకర్యంగా అనిపిస్తే అలా చేయకండి. నోటితోనే హాయ్ అని చెప్పండి.
వినడం నేర్చుకోండి
మొదటి డేట్ లోనే మీరే గలగల మాట్లాడటం వంటివి చెయ్యొద్దు. అమ్మాయిలు ఎప్పుడైనా తమ మాటను ఓపిగ్గా వినే అబ్బాయిలని ఇష్టపడతారు. కాబట్టి వారికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి. వారికి ఎలాంటి అంతరాయం కలిగించకండి. ముఖ్యంగా మీ అభిప్రాయాలు, మీ ఇష్టాలు ముందుగా చెప్పేయడానికి ప్రయత్నించకండి. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే ఎదుటివారి హృదయాలను అంత త్వరగా గెలుచుకోవచ్చు.
అబద్ధం చెప్పవద్దు
ఏ సంబంధంలోనైనా నమ్మకం ముఖ్యం. మొదటి డేట్ లోని అబద్ధాలు చెప్పడం మొదలుపెడితే మీ బంధం ఎక్కువ కాలం నిలబడదు. కాబట్టి గొప్పలు చెప్పుకోవడానికి అందమైన అబద్ధాలు చెప్పడం మానేయండి. భవిష్యత్తులో ఇది మీకు సమస్యలు సృష్టించవచ్చు. కాబట్టి మొదటి డేట్ లో అన్ని నిజాలే చెప్పడానికి ప్రయత్నించండి.
సీరియస్ గా మాట్లాడవద్దు
హ్యూమరస్ గా ఉండే అబ్బాయిలు అమ్మాయిలకి నచ్చుతారు. కాబట్టి మొదటి డేట్ లో సీరియస్ గా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. కాబట్టి చిన్న చిన్న జోక్స్ వేయండి. సరదాగా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగని స్త్రీ వ్యతిరేక విషయాలు, స్త్రీ మనోభావాలు దెబ్బ తినే విషయాలు మాట్లాడకండి. మీరు ఫన్నీగా మాట్లాడితే ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. కాబట్టి మీతో డేట్ బోరింగ్ గా అనిపించదు.
పైన చెప్పిన పద్ధతులను మొదటి డేటింగ్ సమయంలో ఆచరించండి. ఇవన్నీ కూడా వర్క్ అవుట్ అయితే ఆ అమ్మాయి భవిష్యత్తులో మీ గర్ల్ ఫ్రెండ్‌గా తర్వాత ప్రేమికురాలిగా మారే అవకాశం ఉంటుంది.