BigTV English

Viral Video: రీల్స్ పిచ్చి.. నడిరోడ్డుపై తుపాకీతో రచ్చ రచ్చ చేసిన యువతి..!

Viral Video: రీల్స్ పిచ్చి.. నడిరోడ్డుపై తుపాకీతో రచ్చ రచ్చ చేసిన యువతి..!

Viral Video: ఇటీవల కాలంలో యువత రీల్స్ మోజులో పడి తాము ఏం చేస్తున్నామనేదే మరచిపోయి వింతగా ప్రవర్తిస్తున్నారు. వీరిలో కొందరు బహిరంగంగా స్టంట్స్ చేస్తుంటే, మరికొందరు నడిరోడ్డుపై రొమాన్స్ చేస్తూ.. ఫేమస్ అవ్వడానికి చూస్తుంటారు. తాజాగా ఇలానే ఓ యువతి నడిరోడ్డుపై గన్ పట్టుకుని డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసింది. దీంతో ఆమెకు పోలీసులు దిమ్మిదిరిగే షాక్ ఇచ్చారు.


ప్రస్తుతం కాలంలో చేతిలో ఫోన్ ఉందంటే చాలు.. రీల్స్ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. మరి కొందరేమో రీల్స్ చేస్తూ ఒక్క రోజులోనే ఫేమస్ అయిపోతున్నారు. రకరకాల వీడియోలు, స్టంట్స్, రీల్స్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నారు. తాజాగా అలానే ఓ అమ్మాయి చేసిన వీడియో నెట్టింట తెగ్ వైరల్ అవుతోంది. వీడియోలో ఆ యువతి చేసిన పనికి పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

సిమ్రాన్ యాదవ్ అనే యువతి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రముఖ యూట్యూబర్ గా గుర్తింపు పొందింది. అయితే ఆమె ఇటీవలే రద్దీగా ఉండే రోడ్డుపై గన్ పట్టుకుని రీల్స్ చేసింది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.


ఈ వీడియోలో సిమ్రాన్ లక్నోలోని ఓ హైవేపై భోజ్‌పురి పాటకు గన్ పట్టుకుని మరీ డ్యాన్స్ చేసింది. చేతిలోని తుపాకీని ఆకాశం వైపు గురిపెడుతూ రీల్స్ చేసింది. అయితే ఈ వీడియోను చూసిన లాయర్ కళ్యాణ్ జీ చౌదరీ ట్వీట్టర్ ద్వారా పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాడు. లక్నో ఇన్ స్టాగ్రామ్ స్టార్ సిమ్రాన్ ఇలా ప్రమాదకరంగా గన్ పట్టుకుని.. చట్టాన్ని అతిక్రమిస్తూ రీల్స్ చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నారని రాసుకొచ్చారు.

Also Read: రోడ్డుపై బస్సు ఆపి మరీ కొట్టుకున్న ఇద్దరు మహిళలు.. వీడియో వైరల్!

దీన్ని చూసిన పోలీసులు వెంటనే స్పందించారు. బహిరంగంగా తుపాకీ పట్టుకుని రీల్స్ చేయడంపై ఆ వీడియోపై విచారణ జరపాలని ఆదేశించారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, సిమ్రాన్ కు ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో 2.2 మిలియన్ల ఫాలోవర్లు, యూట్యూబ్ లో 1.8 మిలియన్లు ఫాలోవర్లు ఉన్నారు.

Related News

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Viral Video: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Big Stories

×