BigTV English

Samantha : నాగచైతన్య రిలేషన్‌షిప్‌పై కామెంట్స్.. సమంత రియాక్షన్ ఇదే..

Samantha : నాగచైతన్య రిలేషన్‌షిప్‌పై కామెంట్స్.. సమంత రియాక్షన్ ఇదే..

Samantha : నాగచైతన్య-సమంత డైవర్స్ అప్పట్లో ఇండ్రస్టీలో హాట్ టాఫిక్. ఆ తర్వాత చైతు, సామ్ ఎవరీ దారిలో వారు ప్రయాణం సాగిస్తున్నారు. విడాకుల వ్యవహారంపై ఇద్దరూ ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. ఎందుకు విడిపోయారో చెప్పలేదు. కానీ సమంతపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. చైతు నుంచి భరణం కింద భారీగా డబ్బు తీసుకుందని సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరిగింది. అయినా సరే సమంత ఎక్కడా నిగ్రహాన్ని కోల్పోలేదు. ఆ విషయంపై సున్నితంగా స్పందించింది. ఎవర్నీ నిందించలేదు. ఎక్కడా కూడా చైతుపై ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయలేదు. చైతు కూడా తన పనేంటో తను చేసుకుంటున్నాడు. ఎక్కడా డైవర్స్ పై మాట్లాడలేదు. సమంతను కామెంట్ చేయలేదు. ఇలా వారిద్దరూ ఎవరి దారిలో వారు ఉన్నారు.


సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల చైతూ, శోభిత కలిసి ఫోటో దిగడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఈ క్రమంలో వీరి రిలేషన్‌షిప్‌పై సమంత స్పందించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

‘ఎవరు ఎవరితో రిలేషన్ షిప్‌లో ఉన్నారనే దాని గురించి నేను బాధపడటం లేదు. ప్రేమ విలువ తెలియని వారికి ఎంతమందితో సంబంధం ఉన్నా కూడా కన్నీళ్లు మిగులుతాయి. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. అతని ప్రవర్తన మార్చుకుని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది’ అని సమంత అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇలా చైతును కామెంట్ చేసినట్లు వచ్చిన వార్తలను సమంత ఖండించింది. తాను ఎప్పుడూ అలా అనలేదని స్పష్టం చేసింది.


సమంత కథానాయికగా నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచారం కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలో చైతు రిలేషన్ షిప్ పై కామెంట్స్ చేసినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. మరోవైపు విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి మూవీలోనూ సామ్‌ నటిస్తోంది. ‘సిటాడెల్‌’ వెబ్ సిరీస్ ఇండియన్‌ వెర్షన్‌లోనూ నటిస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×