Samantha:ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన అమాయకపు చూపులతో ఎంతోమంది యూత్ హృదయాలు కొల్లగొట్టిన సమంత (Samantha) ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఎంతోమంది యూత్ కి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ ఒక్క సినిమాతో యూత్ కలల రాకుమారిగా మారిపోయిన సమంత.. ఆ తర్వాత ఎన్టీఆర్(NTR),రామ్ చరణ్(Ram Charan),అల్లు అర్జున్(Allu Arjun), మహేష్ బాబు(Mahesh Babu), సూర్య(Suriya), విజయ్(Vijay), నాగచైతన్య(Naga Chaitanya), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వంటి ఎంతోమంది హీరోలతో జతకట్టింది.
స్టార్ హీరోలతో జతకట్టి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత.. అనూహ్యంగా టాలీవుడ్ లోనే బడా ఫ్యామిలీ అయినటువంటి అక్కినేని ఇంటికి పెద్ద కోడలుగా వెళ్లి, అందరి చూపును తన వైపుకు తిప్పుకుంది. ఇక అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్ళాక సమంత ఇమేజ్ మరింత పెరిగింది. పెళ్లయ్యాక కూడా సినిమాలు చేస్తూ తన జోరు కంటిన్యూ చేసింది.కానీ సడన్ గా కొన్ని అనుకోని కారణాల వల్ల నాగచైతన్య – సమంత విడాకులు తీసుకొని, అభిమానులను నిరాశ పరిచారు. ఇక విడాకుల తర్వాత సమంత మయాసైటిస్ బారిన పడడం, ఆమె చేసిన సినిమాలు అన్నీ మనకు తెలిసిందే.
దాచడానికి ఏం లేదంటున్న సమంత..
అయితే ఇదంతా పక్కన పెడితే.. తాజాగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ గురించి సోషల్ మీడియా జనాలు ముచ్చటించుకుంటున్నారు. మరి ఇంతకీ సమంత పెట్టిన ఆ పోస్ట్ ఏంటి..? ఆ పోస్ట్ అర్ధం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం. సమంత తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో “ఇది ఉద్దేశంతో ప్రారంభమవుతుంది..అందులో దాచడానికి ఏమీ లేదు” అంటూ రాసుకొచ్చింది.ప్రస్తుతం సమంత పెట్టిన ఈ పోస్టు భిన్న అర్థాలకు దారి తీస్తోంది. అయితే దాచడానికి ఏమీ లేదంటూ, తన రెండో పెళ్లి గురించి అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సమంత రెండో పెళ్లి వార్తలు నిజమే అనేలా ఎన్ని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా కూడా రాజ్ నిడిమోరుతో తిరగడం ఆపడం లేదు.
ALSO READ:Manchu Vishnu: శ్రీ విష్ణుకి మళ్లీ వార్నింగ్ ఇచ్చిన విష్ణు.. ఈసారి దబిడి దిబిడే!
త్వరలో పెళ్లి వార్తలపై స్పందించనుందా?
ఎక్కడికి వెళ్లినా రాజ్ నిడిమోరుని వెంట బెట్టుకొని వెళ్తూ రెండో పెళ్లి నిజమే అనేలా ప్రవర్తిస్తుంది. అయితే తన రెండో పెళ్లి గురించే సమంత ఇలా ఇన్ డైరెక్ట్ గా దాచడానికి ఏమీ లేదు అని పోస్ట్ పెట్టిందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి సమంత పెట్టిన ఈ పోస్ట్ వెనుక అర్థం ఏంటి..? నిజంగానే రెండో పెళ్లిపై సమంత ఈ విధంగా హింట్ ఇచ్చిందా? అనేది తెలియాల్సి ఉంది. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ మళ్ళీ ఇండస్ట్రీలో యాక్టివ్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. రీసెంట్ గానే శుభం మూవీతో ఫస్ట్ టైం నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక మొదటి సినిమానే హిట్ కొట్టడంతో సమంతకి నిర్మాతగా కూడా అదృష్టం కలిసి వచ్చింది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==